అశోక విజయదశమిమే అసలైన పండుగ
మానవీయ విలువలకు ప్రతిరూపం, ప్రపంచానికి శాంతి బోధించిన బౌద్ధ ధర్మాన్ని అశోకుడు స్వీకరించిన దశమి రోజు నిజమైన విజయదశమని అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, భారతీయ బౌద్ధ మహాసభ కేంద్ర కమిటీ సభ్యులు మిద్దేపాక ఎల్లయ్య అన్నారు. అశోక విజయదశమి పురస్కరించుకొని సోమవారం హన్మకొండ జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్ బుద్ధిని విగ్రహం వద్ద అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన అశోక విజయదశమి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర సమన్వయకర్త సాయిని నరేందర్ మాట్లాడుతూ అశోక విజయదశమిని కనుమరుగు చేయడం కోసమే దేశంలోని బ్రాహ్మణీయ సనాతన వర్గాలు దసరాను ముందుకు తీసుకొచ్చి పరస్పర విరుద్ధమైన రావణాసుర వధ, పాండవులకు సంబంధించిన ఆయుధ పూజ, దుర్గమ్మ మైసాసుర మర్ధిని దసరా సందర్భంగా జరుపుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. విజయదశమి సందర్భంగా అశోకుడు స్వీకరించిన మానవీయ విలువల బౌద్ధ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించి ప్రపంచ శాంతికి ముందువరుసలో ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మాంకాల యాదగిరి, ప్రధాన కార్యదర్శి బందెల అరుణ్ కుమార్, హన్మకొండ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి చిట్యాల బాబు, సలహాదారు ఇమ్మడి కొమురయ్య, ఎస్సీ ఎస్టీ ఎల్ఐసి ఉద్యోగుల సంఘం డివిజనల్ నాయకులు లక్ష్మీనారాయణ, కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గురిమల్ల రాజు, హన్మకొండ జాక్ చైర్మన్ తాడిశెట్టి క్రాంతి, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం జాతీయ వ్యవస్థాపక అద్యక్షులు కొమ్ముల బాబు, మెడికల్ ఉద్యోగ సంఘ నాయకులు రాజయ్య, ఉపాధ్యాయురాలు శోభ, ఏంజెల్, డాక్టర్ కీర్తన, గౌతమ్ రావు, వాత్సల్య, ఠాగూర్, జన్ను భాస్కర్ తదితరులు పాల్గొని అంబేద్కర్, బుద్ధ విగ్రహాలకు పూలమాలలు వేసి మాట్లాడారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box