హైటెక్కు వర్సెస్ హైడ్రామా.. జనానికి కోమా..!


 హైటెక్కు వర్సెస్ హైడ్రామా..

జనానికి కోమా..!



తప్పు చేసినట్టు అభియోగాలు ఉన్నప్పుడు ఎవరినైనా అరెస్టు చేయొచ్చు..గతంలో 

ఎంత మంది 

బడా రాజకీయనాయకులు ఇలా అరెస్టు కాలేదు.చంద్రబాబు నాయుడు దేనికీ అతీతుడు కాదు..ఆయనకి ప్రత్యేక మినహాయింపులు ఉండవు.స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో నిజంగా చంద్రబాబు అవినీతికి పాల్పడి ఉంటే శిక్ష పడుతుంది.ఆయన తప్పు లేనట్టయితే బయట పడతారు.


అయితే ఒక్క విషయం..

ఆరోపణలు ఉన్నాయి గనక..

సాక్ష్యాలు సైతం తమ వద్ద ఉన్నాయని సిఐడి అంటోంది గనక చంద్రబాబుని పోలీసులు నిరభ్యంతరంగా అరెస్టు చేసుకోవచ్చు.కానీ అంత భయోత్పాతం సృష్టించడం దేనికి..స్వేచ్చగా ప్రజల్లో తిరుగుతున్న 

ఒక రాజకీయ నాయకుణ్ణి..

మాజీ ముఖ్యమంత్రిని..

ప్రతిపక్ష నేతను అదుపులోకి తీసుకోడానికి ఇంత సీన్ సృష్టించాల్సిన అవసరం ఉందా..చంద్రబాబు పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న నేరస్థుడు కాదు కదా..

ఇది హత్య కేసు 

కానే కాదు కదా..

నిజానికి ఇలాంటి కేసుల్లో స్టేషన్ కి రమ్మని హుందాగా పిలవచ్చు...లేదంటే విచారణ కోసం మర్యాదగా 

తీసుకు వెళ్ళవచ్చు .

కాదూ..ఒకవేళ అరెస్టు చేయడమే పద్ధతి అనుకున్నప్పుడు ఉదయం తీసుకు వెళ్ళవచ్చు.అదేదో తీవ్రమైన నేరస్థుడి మల్లె 

తెల్లవారుజామున అంత హడావిడి సృష్టించి అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం ఏముంది ..అది కూడా శనివారం నాడు.!


అక్కడితో ఆగారా..


చంద్రబాబు నిందితుడు గనక ఆయన్ని అరెస్టు చేశారని అనుకున్నా రాష్ట్రంలో ఎక్కడికక్కడ తెలుగుదేశం నాయకుల్ని అరెస్టు చెయ్యడం..నిర్బందించడం దేనికి..స్కిల్ డెవలప్మెంట్ 

ఉదంతానికి..వారికి సంబంధం ఏమిటి..

శాంతిభద్రతల దృష్ట్యా అరెస్ట్ చేసినట్టు చెప్పుకోవచ్చు గాక..అంత బలమైన యంత్రాంగం ఉన్నప్పుడు అల్లర్లు జరగకుండా ఆపలేరా..ఏదో జరుగుతుందని ప్రభుత్వమే సీన్ క్రియేట్ చేసి ప్రజల్లో ఆందోళన పెంచడం..

బస్సులు ఆపేసి అసౌకర్యం కలిగించడం అవసరమా..


రాష్ట్రంలో తెలుగుదేశం నాయకుల్ని అరెస్టు చేసిన ప్రతి సందర్భంలో ఇదే సన్నివేశం. ఇంతా చేసి ప్రభుత్వం గెలుస్తున్నది తక్కువ...తలవంపులు తెచ్చుకుంటున్నది ఎక్కువ.

ఇప్పుడు కూడా ముందస్తు జాగ్రత్తగా కీలక పత్రాలు మాయమైనట్టు ఒక బాణం వదిలి ఉంచారు. ఏమిటిదంతా..!?


అయినా మన దేశంలో

కేసులు తేలేదెన్నడు..

నిందితులకు

శిక్షలు పడేదెప్పుడు..

ఎన్ని ఉదంతాలు చూడ్డం లేదు మనం.కేసులు పెట్టడం..విచారణ పేరిట సంవత్సరాలు దొర్లిపోవడం..

అరెస్టులు..బెయిళ్ళు..ఈలోగా నిందితులు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి అందలాలు ఎక్కడం..ఆపై వారే ఇంకొన్ని అరెస్టులు చేయించడం..

ప్రజలు వెర్రిబాగులోళ్లు..

ప్రజాస్వామ్యం ఓ పిచ్చి మాలోకం..చట్టాలు నేరస్థుల చుట్టాలు..కోర్టులు గుడ్డివి..


కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు..

అరెస్టు అయి బయటికి వచ్చిన వాళ్ళు ఎన్నికల్లో పోటీ చెయ్యడాన్ని నిషేధించే సవరణ ఎవరూ ప్రతిపాదించరు..దించినా

ఆమోదించరు..


ఈ రాజ్యాంగానికి ఓ పెద్ద నమస్కారం..


కొసమెరుపు..

ఒకవేళ అలాంటి చట్టం ఏమైనా రాబోతోందా ఏంటి..కొంపదీసి..

అప్పుడు తనతో పాటు

చంద్రబాబు కూడా పోటీ చేయకుండా అడ్డుకట్ట వేసే 

ప్రణాళికా ఇది..🫢😜🤫


                 ఈఎస్కే..!

                     జర్నలిస్ట్



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు