కన్నాంబ..
పల్నాటి గడ్డను శాసించిన నాయకురాలు నాగమ్మకు
తొలినాటి రూపం..
*భానుమతి..*
అదే నాగమ్మకు మరోనాటి
ఉగ్రరూపం..
ఆ ఇద్దరి కలగలుపై..
మాహిష్మతి మేలుకొలుపై..
ఆధునిక భారతంలో
రాచరిక దర్పానికి..
రాణివాస గాంభీర్యానికి..
నిలువెత్తు రూపమై...
నిలిచిన శివగామి..
*భారతీయ సినిమాలో*
*అభినయ అగ్రగామి..*
*రమ్యకృష్ణ..ఆమె కళాతృష్ణ!*
అంతకు కొంచెం మునుపు..
రజనీకాంతునికే మైమరపు..
*_ఓ మెరుపు..నీలాంబరి.._*
తలైవాదే అందమైన స్టయిల్..
ఆయనను మించిన పొగరు..
ఎలా ఉంది
నా ఇంటి పనిమనిషి..
అదిగింది సౌందర్య కుశలమా
*రమ్యకృష్ణ కౌశలమా..*
అతిగా ఆశపడినా..
చరిత్రలో మునుపెన్నడూ లేని అభినయమా..
నరసింహా హిట్టులో
*రజనీ..రమ్య ఒకటే అన్నట్టు ద్విపాత్రాభినయమా!*
మొదట్లో ఐరన్ లెగ్గు..
*అల్లుడుగారు* లో మూగనోముతో
ముద్దబంతిపూవై ఒలకబోసిన
అందమైన సిగ్గు..
దర్శకేంద్రుడి హస్తవాసి..
అందుకుంది అందాలరాశి..!
సూపర్ హిట్టులకు ఆహ్వానం..
*అల్లరిప్రియుడు* కృష్ణవంశీ
*అల్లరిమొగుడు* గా *బృందావనం* లో కాపురం..
నాటి నుంచి
హిట్టు మీద హిట్టుతో
*_దీర్ఘసుమంగళీభవ!!_*
___________________
హ్యాపీ బర్త్ డే రమ్యకృష్ణ...
*ఎలిశెట్టి సురేష్ కుమార్*
9948546286
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box