ఇదెక్కడి "న్యాయస్థాన"భ్రంశం..!?

 ఇదెక్కడి "న్యాయస్థాన"భ్రంశం..!?



భారత దేశంలో కోర్టులు మనుగడలోనే ఉన్నాయి కదా.. మరి కోర్టుల్లో ఉన్న ఉదంతాల గురించి ఎవరు పెడితే వారు మాటాడేస్తే ఎలా..ఏదైనా ఒక వ్యవహారం న్యాయస్థానంలో ఉన్నప్పుడు ఇక బయట ఎవరూ దానిపై మాటాడకూడదు.ఈ కనీస ధర్మానికి వర్తమానంలో మామూలు వ్యక్తులతో పాటు రాజకీయ నాయకులు..

ప్రజాప్రతినిధులు..

చివరకు ఉద్యోగులు.. ఉన్నతాధికారులు కూడా తిలోదకాలిచ్చి యధేచ్చగా మాటాడేస్తున్నారే.ఏమిటిది..

ఇంకెక్కడుంది న్యాయం.. మరెక్కడుంది న్యాయస్థానాల పట్ల గౌరవం..రేపు కోర్టులో ఎలాంటి తీర్పు రాబోతుందో కూడా చెప్పేసే ప్రబుద్ధులు తయారవుతున్నారు.

ఇదీ మన వ్యవస్థ..!


ఇటీవలి రోజుల్లో ఇలాంటి 

దిగజారుడు వ్యవహారాన్ని మనం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు..

మాజీ ముఖ్యమంత్రి 

నారా చంద్రబాబు నాయుడు అరెస్టు ఉదంతంలో ఉధృతంగా చూస్తున్నాం.

ఏ నిమిషాన చంద్రబాబును సిఐడి పోలీసులు అరెస్టు 

చేశారో అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒకటే గోల.

ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియని గందరగోళం.

ఇక్కడ ఒక్క విషయం ప్రస్తావించుకుందాం.

*_చంద్రబాబు అనే కాదు.._*

*_ఎవరు తప్పు చేసినా_*

*_శిక్ష అనుభవించవలసిందే._*

న్యాయానికి..ధర్మానికి ఎవరూ అతీతులు కారు.

అక్కడి వరకు బాగానే ఉంది.

కానీ కోర్టు ఏ సంగతీ తేల్చుకుండానే..అసలు దర్యాప్తు చేస్తున్న అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో చార్జిషీట్ దాఖలు చెయ్యక మునుపే జనాలు కౌంటర్లు...ఎన్ కౌంటర్లు పరంపరగా చేసేస్తున్నారే.


ఇక్కడ మరో విషయం..

ఎవరిపైనైనా అభియోగాలు వచ్చినప్పుడు కోర్టు నిర్ధారించే వరకు వారు *_నిందితులే..ముద్దాయి గాని దోషి గాని కాదు._*

పెద్ద పెద్ద నాయకులు సైతం ఈ కనీస పరిజ్ఞానం లేక తెగ 

మాటాడేస్తుండడం దురదృష్టకరం..

ఆపై సిగ్గుచేటు కూడా..!


వైసిపి నాయకులు సరే..

వాళ్ళు ఈ మొత్తం అంతా చేసిందే రాజకీయ ప్రయోజనం కోసం..

ఎలాగైనా చంద్రబాబు నాయున్ని దోషి..

ఫ్రాడ్ అనడం కోసమే ఇంత వ్యవహారం.. అలా మాటాడుతున్న వారిలో సగానికి పైగా గులివింద గింజలే..ఆ సంగతి ప్రజలకి తెలియదా..చంద్రబాబు అరెస్టు అయింది మొదలు

వైసిపి నాయకులు..కొందరు మంత్రులు.. ప్రధానంగా రోజా

చంద్రబాబు దోషి..దోషి అంటూ వేల గొంతులతో చాటుతున్నారు.పోనీ ఒప్పుకుందాం. కాని ఒకసారి ఒక కేసులో జైలుకి వెళ్లిన మనిషి అవినీతిపరుడు..

నేరస్థుడు..దోషి..దేశద్రోహి అని నిర్ధారణ అయిపోతే మరి నెలలు..సంవత్సరాల తరబడి కారాగారంలో ఉండి..పదుల సంఖ్యలో చార్జిషీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి ఏం కావాలి..ఆ లాజిక్ ఎలా మిస్సవుతున్నారో అంతా..!


ఇవన్నీ ఎవరికీ తెలియనివి కావు..అయితే

*_గోల చెయ్యడమే గోల్.._*

అదేదో సినిమాలో 

బంగారం గారి సింగారం 

అన్నట్టు తోచకుండా చేసెయ్యడమే మిషన్..!


*_ప్రజాస్వామ్యమా.._*

*_నీకో నమస్కారం.._*

*_రాజ్యాంగమా.._* 

*_నీకు కోటి దం(గం)డాలు.._*

ఈ దేశంలో ఏదైనా చెల్లుతుంది.ఎన్ని తప్పులు చేసినా తప్పించుకు తిరగవచ్చు.అన్నిటి కంటే పెద్ద చులాకు ఏంటంటే కోర్టుకు వెళితే సంవత్సరాల తరబడి సాగదీత..ఈలోగా స్కాములవీరులైనా.. అవినీతి సమ్రాట్టులైనా..

రేపిస్టులైనా.. ఫ్యాక్షనిస్టులైనా..

చివరికి హంతకులైనా

బయట యధేచ్చగా తిరగవచ్చు..ఎన్నికల్లో పోటీ చేసి రాజ్యాలు ఏలవచ్చు..

మునుపు జైల్లో ఉన్న వ్యక్తి అధినాయకుడై 

పోలీసులతో సలాములు చేయించుకుంటూ..జడ్జీలతో కూడా తిరుగుతూ చలామణీ కావచ్చు.


నీకూ..నాకూ ఉద్యోగం కావాలన్నా..పాస్ పోర్టు రావాలన్నా పోలీస్ కేసులు

ఉండకూడదు..ఎన్నికల్లో పోటీ చేయడానికి అలాంటి ప్రతిబంధకాలు ఉండవు..

*_అది ప్రజాస్వామ్యం.._*

నువ్వూ నేనూ ఒకసారి

జైలుకి వెళ్లి వచ్చామనుకో..

జనం పురుగుని చూసినట్టు చూస్తారు.అదే నాయకులైతే

గెలిపించి గులాముగిరీ చేస్తారు..

*_అదీ ప్రజలస్వామ్యం..!_*


     *_ఈఎస్కే..జర్నలిస్ట్_*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు