లండన్ లో ప్రవాసీ భారతీయులతో రాహుల్ గాంధి


విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధి లండన్ సందర్శన సందర్భంగా ఆక్కడి ప్రవాసీ భారతీయులు ఆయనతో సమావేశమయ్యారు.  ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రేస్ యూకే చాప్టర్ అధ్వర్యంలో లండన్ లోని హ్యూస్టన్ లో రాహుల్ గాంధీతో సమావేశం జరిగింది. వేలాది మంది ప్రవాసీభారతీయులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశ మందిరం ప్రవాసీయులతో కిక్కిరిసి పోయింది. 

పార్కింగ్ సమస్య కారణంగా అనేక మంది బయటే నిలిచిపోయి రాహుల్ గాంధీని కలిసే అవకాశం లభించ లేదని నిర్వాహకులు తెలిపారు.

ప్రవాసీ భారతీయులను  ఉద్దేశించి రాహులం గాంధి మాట్లాడారు. 


ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రేస్ యూకే చాప్టర్ ప్రతినిధులు సబ్యులతో పాటు వరంగల్ ఎన్ఐర్ఐ ఫోరం లండన్ యుకే ప్రతినిదులు సబ్యులు సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా రాహుల్ గాంధి మాట్లాడుతూ  భారత్ జోడో యాత్ర సందర్భంగా తన అనుభవాలను ప్రవాసీయులతో పంచుకున్నారు. బిజేపి వివక్ష పాలనలో అనేక వర్గాల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. విద్వేష పూరిత పాలనసాగిస్తున్న బిజెపి పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసేందుకే తన యాత్రను కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కొనసాగించానని తెలిపారు.


దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఆదివాసీలకు ఉపాధి మార్గాలు లేవన్నారు. బిజెపి పాలకులు నిరుపేదల సమస్యలు పట్టించు కోకుండా అంబానీ ఆదానీ వంటి బడా పారిశ్రామిక వేత్తల సేవల్లో మునిగి తేలుతూ ప్రభుత్వ రంగ సంస్థలను వారికి ధారాదత్తం చేస్తున్నారని రాహుల్ గాంధి విమర్శించారు.

లండన్ పార్లమెంట్ సబ్యులు రాహుల్ గాంధీని ఆహ్వానించి ఆయన ప్రసంగం విన్నారు. రాహుల్ గాంధీతో పాటు  ప్రవాసీ భారతీయుల ప్రతినిధులు పలువురు పార్లమెంట్ సమావేశం మందిరంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.



రాహుల్ గాంధి వెంట కాంగ్రేస్ పార్టి సీనియర్ నేత మధుయాష్కి గౌడ్,ఇండియన్ ఓవర్సీస్ యూకే చాప్టర్ ప్రెసిడెంట్ కమల్ దలివాల్, స్పోక్స్ పర్సన్ సుధాకర్ గౌడ్, గంపా వేణుగోపాల్(సిద్దిపేట) సబ్యులు మరియు వరంగల్ ఎన్ఆర్ఐ ఫోరం లండన్ యూకే గంపా వేణుగోపాల్(సిద్దిపేట) శ్రీధర్ నీల,  ప్రవీన్ రెడ్డి, మేరీస్, రాకేశ్, శ్రీధర్,  పాల్గొన్నారు.

వరంగల్ ఎన్ఆర్ఐ ఫోరం నిర్వహిస్తున్న పలు సామాజిక సేవా కార్యక్రమాలను రాహుల్ గాంధీకి వివరించినట్లు  శ్రీధర్ నీల తెలిపారు. కాంగ్రేస్ పార్టి కారంలోకి రావాలని ఎన్ఆర్ఐ ఫోరం ప్రతినిధులు ఆకాంక్షించారు.


వీడియో కోసం ఇక్కడ క్లిక్  చేయండి




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు