తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర కీలకం - చీఫ్ విప్ వినయ్ భాస్కర్

 విద్యార్థి ఉద్యమకారుల చరిత్ర మరువలేనిది

విద్యార్థి ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తాం : చీఫ్ విప్ వినయ్ భాస్కర్

విద్యార్థులు చరిత్రలో నిలిచిపోతారు : ప్రొఫెసర్ సీతారాం నాయక్

ఉద్యమంలో విద్యార్థులు స్ఫూర్తి ప్రదాతలు : ప్రొఫెసర్ దినేష్ కుమార్


తెలంగాణ దీక్ష దివాస్ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలో తెలంగాణ పోరాటం చేసిన విద్యార్థి, యువజన ఉద్యమకారుల అలయ్  బాలయ్ కార్యక్రమం హనుమకొండలోని రెవెన్యూ అతిథి గృహంలో  జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, ప్రొఫెసర్ దినేష్ కుమార్ ముఖ్యఅతిధులుగా హాజరై కార్యక్రమంలోని అమరవీరుల స్థూపానికి ముందుగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ  నవంబర్ 29 సందర్భంగా తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకులు, కెసిఆర్ చేసిన దీక్ష "తెలంగాణ వచ్చుడో -కెసిఆర్ చచ్చుడో" అనే నినాదంతో తెలంగాణ సమాజం కోసం ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ  అన్ని రంగాల్లో ముందులు పోతుందని, ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి ఈ దీక్షా దివాస్ కార్యక్రమం 11 రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సకల జనులు, విద్యార్థులు, లాయర్లు,డాక్టర్లు అనేక సంఘాలు ఉద్యమంలో మమేకమై పని చేసాయని, అందులో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నటువంటి ఉద్యమకారుల స్థితిగతులు వారు చేసినటువంటి పాత జ్ఞాపకాల్లో నేమరు వేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని అన్నారు.తెలంగాణ సమాజం అంతట ఉద్యమం కొనసాగి,తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని కేసీఆర్  నాయకత్వాన్ని బలపరుస్తూ మరోసారి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి,బంగారు తెలంగాణ కోసం, భవి తరాల భవిష్యత్తు కోసం పునాది వేస్తుందని అన్నారు.మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ మాట్లాడుతూ దీక్ష దివాస్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని ఉద్యమ కారుల చరిత్రను బుక్ లేట్ల ద్వారా తీసుకోవడం, వారి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం ఆనందంగా ఉందని, దీనికి సహాయ సహకారలు ఇచ్చిన వినయ్ భాస్కర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఎవరికి వారే చరిత్ర రాసుకోవాలని అదేవిధంగా కాకతీయ విశ్వవిద్యాలయంలోని విద్యార్థి ఉద్యమకారులు మీ చరిత్రను మీరే రాసుకోవాలని, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు చరిత్రలో నిలిచిపోతారని అన్నారు.

మరొక ముఖ్య అతిథి ప్రొఫెసర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు స్ఫూర్తి దాతలు అన్నారు. విద్యార్థిగా ఉన్నప్పుడు వారిలో యువ రక్తం ప్రోత్సహించినప్పుడు అనేక ఉద్యమాల ద్వారా తెలంగాణకు తోడ్పడు అందించాలని,వినయ్ భాస్కర్ కూడా అప్పుడు యువ రక్తంతో ఉన్నాడు కాబట్టే అనేక కార్యక్రమాలు చేశాడని అన్నారు.అనేక కార్యక్రమాల ద్వారా అనేక విధాలుగా తెలంగాణ ఉద్యమాన్ని చాటారని, అంతర్గత పోరాటంలో కూడా విద్యార్థుల పాత్ర ఎంతగానో ఉందని అన్నారు.అంతే కాకుండా జార్ఖండ్, అస్సాంలో ఉద్యమం ద్వారానే రాష్ట్రం ఏర్పడిందని,కానీ అక్కడ విద్యార్థి ఉద్యమకారులకు న్యాయం జరిగిందని, తెలంగాణలో విద్యార్థి ఉద్యమకారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వినయ్ భాస్కర్ కు విజ్ఞప్తి చేశారు.ఉద్యమకారులంతా కూడా సంఘర్షణలో ఉన్నారని, ఉద్యమం చేయడంతో సరిపోయిందని వారికి ఉపాధి లేదని,అలాంటి వారికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ అలనాటి ఉద్యమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఎన్నో కేసులు, అయినా కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు పాటుపడ్డానని తెలిపారు.రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చిన అనేక సంఘటనలు మనం చూడడం జరిగిందని,కొన్ని లక్షల మందితో ఏర్పాటు చేసినటువంటి సభ వరంగల్ లో జరగడం అదృష్టం అని అన్నారు.అన్ని వర్గాల ప్రజలు బాగుపడడం కోసం తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, ఆ దిశగా అన్ని రంగాలలో ముందుకు దూసుకెళ్తుందని అన్నారు. కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించాలని, ఉద్యమ కాలంలో టీజీఏ ప్రాధాన్యత, ఉద్యమంలో టీజేఏ పాత్ర గురించి వివరించారు.అర్థనగ్న ప్రదర్శన,610 జీవో,కెసిఆర్ గారితో చేపట్టినటువంటి మహాసభలు ఇవన్నీంటిని కూడా గుర్తు చేసుకున్నారు.అలాగే విద్యార్థి ఉద్యమకారులందరు 300 మందికి శాలువా,మేమంటో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో కాకతీయ విద్యార్థి ఉద్యమకారులు రాజేష్,ఫిరోజ్,జోరిక రమేష్, వీరేందర్,కంజర్ల మనోజ్,బైరపాక ప్రశాంత్, నాగరాజు, శరత్ చంద్ర, చిరంజీవి,జడ్పీటీసీలు సైదిరెడ్డి, శ్రీరాం శ్యామ్,రంజిత్,నాగరాజు, ఇండ్ల నాగేశ్వరరావు,బండి రజిని కుమార్ సౌరం రఘు, దర్శన్ సింగ్,చాగంటి రమేష్, రాము తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు