అద్యక్ష బాద్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గే
కాంగ్రేస్ పార్టి పోరాటం చేస్తున్నది పార్టి కోసం కాదని దేశ ప్రజలందరి భవిష్యత్ కోసమని మల్లికార్జున్ ఖర్గే అన్నారు
పార్టీ కొత్త అధ్యక్షుడిగా మల్లిఖార్జునఖర్గే ఈ రోజు నాయకత్వభాద్యతలు చేపట్టారు
ఢిల్లీలోని పార్టి ఏఐసిసికార్యాలయంలో మల్లికార్జున్ ఖర్గేకు పార్టి అధినేత్రి సోనియా గాంధి భాద్యతలు అప్పగించారు
పార్టి కర్తవ్యాన్నినెరవేర్చేందుకు కాంగ్రేస్ శ్రేణులన్ని తనకు సహకరించాలని అందరి సహకారంతో చేయి చేయికలిపి పార్టీని బలోపేతం చేద్దామన్నారు
తామంతా మహాత్మా గాంధి సిపాయిలమని పేర్కొన్నారు
ఎవరికి భయపడేదిలేదన్నారు.
భయం తొలగిస్తే ఏది అడ్డుఉండదని అన్నారు
భయం పక్కన డితే విజయం మన ముందు నిలుస్తుందన్నారు
రాహుల్ గాంధి పార్లమెంట్ లో ఇదే విషయం చెప్పారని
ఇక నుండి తమ స్లోగన్ ఇదే నని ఖర్గే పేర్కొన్నారు
రాహుల్ గాంధి భారత్ జోడో యాత్రపార్టీకి స్పూర్తిగా నిలిచిందని అన్నారు
అన్ని వర్గాలవారు జోడో యాత్రకుసంఘీభావంగా నిలుస్తున్నారని అన్నారు
పార్టీలో తను ఏ స్థాయి నుంచి ఎదిగాడో తన ప్రస్తానాన్ని వివరించారు మల్లిఖార్జున్ ఖర్గే
ఓ కార్మికుడి కుమారుడి నుంచి సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టే వరకూ సాగిన తన ప్రయాణం గురించి వివరించారు
పనితీరు, అనుభవంతో పార్టీని ఉన్నతశిఖరాలకు తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు
అనుభవం కలిగిన నేతలందరూ యువకులు తనకు సంపూర్ణంగా సహకరించాలన్నారు
పార్టి తాత్కాలిక అధ్యక్ష స్థానం భాద్యతలు ముగిసిన సోనియా గాంధి మాట్లాడుతూ
పార్టీ ఎదుట చాలా సవాళ్లు ఉన్నాయని దేశ ప్రజాస్వామ్యానికి ఏర్పడిన ముప్పుతో పోరాడటమే
కాంగ్రేస్ పార్టి ముందు ఉన్న అతిపెద్ద సవాలని అన్నారు
కాంగ్రెస్ చాలా పెద్ద సవాళ్లను ప్రమాదాలను గతంలో కూడా
ఎదుర్కొందని కానీ ఎప్పుడూ ఓటమిని అంగీకరించలేదన్నారు సోనియా గాంధి
భవిష్యత్తులో కూడ పార్టి పోరాడి విజయం సాధిస్తుందని తనకు నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు
ఎంతో అనుభవం ఉన్న మల్లిఖార్జున్ ఖర్గే పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలవనున్నారని అన్నారు
ఎంతో కష్ట పడి పార్టీలో ఎదిగారని ప్రశంసించారు
తాను పార్టి అధ్యక్షురాలిగా కొనసాగిన కాలంలో తనకు తోడ్పాటు నందించిన పార్టి కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు
మార్పు అనేది అనివార్యమని పార్టి నాయకత్వ భాద్యతల నుండి వైదొలిగిన తర్వాత తనకు కొంత ఊరట లభించిందని అన్నారు
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పటి చిత్ర పటాన్ని మల్లికార్జున్ ఖర్గే సోనియా గాంధీకి అంద చేసారు
ఖర్గే అందించిన తన భర్త చిత్ర పటాన్ని కార్యక్రమానికి హాజరైన పార్టీ నేతలకు చూపించి సోనియా గాంది ఆనందం వ్యక్తం చేశారు
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box