ఇన్పోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి అల్లుడు
రిషి సునాక్ పూర్వీకులది గుజరాత్
నారాయణ మూర్తి కూతురు అక్షితా మూర్తి ని ప్రేమంచిపెండ్లి చేసుకున్న రిషి
హిందు సాంప్రదాయవ్యక్తి నేడు బ్రిటన్ ప్రధాని అంటే ఆశ్చర్యంగా ఉంది కదా
రిషి ప్రధాని కావడం ప్రతిభారతీయుడికి గర్వ కారణం
భారతీయులకు అసలైన దీపావళి
వలస పేరుతో భారత దేశానికి వచ్చి భారతీయులందరిని బానిసలుగా చేసిన బ్రటిష్ దేశానికే ఇప్పుడు భారత సంతతి వ్యక్తి ప్రధాని కావడం గర్వకారణం.
సుమారు 200 ఏండ్లు మనల్ని పాలించిన ఆంగ్లేయులను ఇప్పుడు మన వాడు పరిపాలించనున్నాడనే అనుభూతి
భారతీయ నెటిజెన్లు రిషి ప్రధాని ఎంపికతో సంతోషాలను ఇలా పంచుకున్నారు
భారతీయులు గర్వించే విదంగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధాన మంత్రి పీఠాన్ని అధిరోహించారు.
మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ రేసు నుంచి తప్పుకోవడంతో ప్రధానిరేసులో దూసుకు పోయిన రిషి సునాక్ను పోటీ లేకుండా ప్రధాని పదవి వరించింది.
రిషి సునాక్ భారత సంతతికి చెందిన వ్యక్తి
ఆయన భార్య అక్షితా మూర్తి మరెవరో కాదు.
భారత ఐటి ధిగ్గజం ఇన్పోసిస్ కోఫౌండర్ నారాయణ మూర్తి కూతురు.
2009 సంవత్సరంలో రిషి సునాక్ అక్షితా మూర్తిల వివాహం జరిగింది.
వారిది ప్రేమ వివాహం
వారికిద్దరు కూతుర్లు ఉన్నారు.
రిషి సునాక్ అతి చిన్న వయస్సులో ప్రధాన మంత్రి పదవి భాద్యతలు చేపట్టిన వ్యక్తిగా రికార్డు స్వంతం చేసుకున్నాడు.
అంతే కాదు తొలిసిరిగా ఆసియా ఖండం నుండి ఎంపికైన బారత సంతతి వ్యక్తి
రిషి 1980 మే నెల 12 వ తేదీన ఇంగ్లాండ్ లోని సౌథాంప్టన్‌లో జన్మించాడు.
ఆయన పూర్వీకులు పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు.
వారు మొదట తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లి అక్కడి నుండి యూకేకు వలస వెల్లి అక్కడే స్థిరపడ్డారు.
రిషి తండ్రి కెన్యాలో జన్మించారు.
తల్లి ఉష టాంజానియా లో జన్మించారు.
రిషి సునాక్ స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో ఎంబిఏ చేసారు.
చదువు పూర్తి అయిన తర్వాత కన్జర్వేటరి పార్టీలో ఇంటర్న్ షిప్ చేసిన రిషి 2014 లో నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు.
రిషి సునాక్ 1915 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రిచ్‌మాండ్ నుండి తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు.
2019 ఎన్నికల్లో రిషి బోరీస్ జాన్సన్ కు మద్దతు మద్దతు తెలిపారు.
ఆర్థిక శాఖలో ప్రధాన కార్యదర్శిగా రిషి బాద్యతలు నిర్వహించారు.
2020 ఫిబ్రవరి లో చాన్స్ లర్ గా ఆతర్వాత ఆర్థిక మంత్రిగా పదోన్నతి పొందారు.
బ్రటన్ రాజకీయంగా ఆర్థికంగా తీవ్ర సంక్షోభం ఎదుర్కుంటున్న సమయంలో రిషి సునాక్ ప్రధాని కావడం ఆయనకు పెద్ద సవాల్ అని చెప్పవచ్చు
ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది మన పార్టీని ఏకం చేసి మన దేశానికి అందించాలని కోరుకుంటున్నాను అంటూ రిషి సునాక్ ప్రధాని పదవి రేసులోకి దిగుతూ ట్వీట్ చేసారు.
బోరిస్ జాన్సన్ తప్పుకుంటున్నట్లు ప్రకటనచేసిన తర్వాత ఆయన నాయకత్వాన్ని ప్రశంసిస్తూ సునాక్ ట్విట్ చేశారు.
బ్రెగ్జిట్, కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ, ఉక్రెయిన్ యుద్ధంతో సహా కొన్ని కఠినమైన సవాళ్ల ద్వారా దేశాన్ని జాన్సన్ ముందుకు నడిపిన తీరు ఎంతో ప్రశంసనీయమని ఆయన మళ్లీ ప్రధాని పదవికి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నప్పటికీ స్వదేశంతో పాటు విదేశాలలో ప్రజా జీవితానికి దోహదపడతారని తాను నిజంగా ఆశిస్తున్నానని అన్నారు.
రిషి సునాక్ యూకే ప్రధానిగా ఎంపికవడంతో బారతీయ ప్రముఖుల నుండి ప్రశంసలు వెల్లువెత్తాయి.
Watch on You tube:యుట్యూబ్ చూడండి https://youtu.be/rGAC7hzWNA8
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box