తనకు సంతానం కావాలని తాను తల్లిని కావాలనుకుంటున్నానని జైలులో శిక్ష అనుభవిస్తున్న తన భర్తకు పెరోల్ మంజూరు చేయాలని కోరుతూ ఓ భార్య వేసిన పిటిషన్‌పై కోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చింది.
అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమె భర్తకు 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది.
రాజస్థాన్‌కు చెందిన రాహుల్ 25 సంవత్సరరాల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన కేసులో 20 ఏళ్ల శిక్ష పడి జైలు జీవితం గడుపుతున్నాడు. అతనికి సంతానం లేదు.
ఆయన భార్య న్యాయవాదులను సంప్రదించి వారి సలహాల మేరకు సంతాన భాగ్యం కల్పించాలంటు కోర్టును వేడుకుంది. తాను తల్లిని కావాలనుకుంటున్నానని, తన భర్తకు పెరోల్ మంజూరు చేయాలని రాహుల్ భార్య హైకోర్టులో దాఖలు చేేసిన పిటిషన్ పై న్యాయమూర్తులు క్షున్నంగా పరిశీలించి తీర్పు ఇచ్చారు.
ఈ కేసును విచారించిన జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ సమీర్ జైన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పిటిషనర్ కోరికను మన్నించింది.
దోషి భార్య పిల్లలు కావాలని కోరుకుంటోందని, శిక్ష అనుభ విస్తున్న భర్త సంతానభాగ్యం కోల్పోయే పరిస్థితుల్లో ఆమె జీవించకూడదని కోర్టు స్పష్టం అభిప్రాయపడింది. ఆమె తన వంశ పరిరక్షణ కోసమే పిటిషన్ దాఖలు చేసిందని పేర్కొంది. పిటిషన్‌ను తిరస్కరిస్తే హక్కులను కాలరాసినట్టే అవుతుందన్న కోర్టు పేర్కొంది. దోషికి 15 రోజుల పెరోలు మంజూరు చేస్తు శరతులపై అనుమతుులు ఇచ్చారు. రూ. 2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు లక్ష రూపాయల చొప్పున రెండు జామీను బాండ్లు సమర్పించి పెరోలు పొందొచ్చని న్యాయమూర్తులు ఆదేశించారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box