ఢిల్లీ యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా పనిచేసిన జిఎన్ సాయిబాబా కేసు విషయంలో బాంబే హైకోర్టు శుక్రవారం కీలక తీర్పును వెల్లడించింది.
అతనిని బాంబే హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. అతడిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. 2017లో ట్రయల్ కోర్టు దోషిగా నిర్ధారిస్తూ యావజ్జీవ కారాగార శిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ సాయిబాబా అప్పీల్ ముంబే హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయమూర్తులు రోహిత్ డియో, అనిల్ పన్సారేలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తార్పు వెల్లడించింది.
శారీరక వైకల్యం కారణంగా వీల్‌చైర్‌లో ఉన్న జీఎన్ సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు.కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం,ఇండియన్ పీనల్ కోడ్ లోని వివిధ నిబంధనల ప్రకారం సాయిబాబా తోపాటు ఇతరులను గతంలో కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో మరో ఐదుగురు దోషుల అప్పీల్‌ను కూడా హైకోర్టు ధర్మాసనం అనుమతించి వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఐదుగురిలో ఒకరు అప్పీలు విచారణలో ఉండగానే మరణించారు.మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని సెషన్స్ కోర్టు మార్చి 2017 మార్చి నెలలో సాయిబాబా, ఇతర వ్యక్తులను దోషులుగా నిర్ధారించింది.
సాయిబాబా ఢిల్లీ యూనివర్సిటీ అధ్యాపకుడిగా పనిచేశారు. 2003లో రామ్‌లాల్ ఆనంద్ కళాశాలలో 2003లో ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. 2014లో మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడే యూనివర్సిటీ అతనిని సస్పెండ్ చేసింది. 2014లో సస్పెన్షన్‌కు గురైనప్పటి నుంచి అతని కుటుంబం సగం జీతం మాత్రమే లభిస్తోంది.
UPDATE: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కేసులో మానవ హక్కుల కార్యకర్త, ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాతో పాటు మరికొంతమందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ నిన్న బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇవ్వాల (శనివారం) సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై బాంబే హైకోర్టు పూర్తి స్థాయిలో విచారణ జరపలేదని, కేసు ఇంపార్టెన్స్‌ని పరిగణనలోకి తీసుకోలేదని సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box