5 జి సేవలు ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోది

 


టెలికాం రంగంలో ఓ నూతన శకం అరంభమైంది. డాటావేగంలో 4 జి కన్నా పది రెట్ల వేగంతో పనిచేసే 5 జి సేవలు దేశంలో అంటుబాటులోకి వచ్చాయి. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో శనివారం  ప్రధాన మంత్రి నరేంద్ర మోది 5 జీ సేవలను లాంచనంగా ప్రారంభించారు. రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేష్ అంబానీ, రిలయన్స్ జియో సీఈవో ఆకాశ్ అంబానీ, ఎయిర్‌టెల్‌ చైర్మన్ సునీల్ మిట్టల్, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా సమక్షంలో ఆవిష్కరణ జరిగింది. ప్రస్తుతం దేశంలోని 9 నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 

డిసెంబర్ 2023 నాటికి దేశవ్యాప్తంగా వేగవంతమైన 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కంపెనీలు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాయి. 5G నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తే మీరు ఇప్పటికే ఉన్న 4G LTE కంటే కనీసం 10 రెట్లు వేగవంతమైన ఇంటర్నెట్ వేగాన్ని పొందుతుందని కంపెనీలు చెబుతున్నాయి. సుమారు రెండు గంటల నిడివి ఉండే సినిమాను కేవలం 7 నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోది మాట్లాడుతూ130 కోట్ల మంది భారతీయులకు టెలికాం పరిశ్రమ ఇస్తున్న బహుమానం ఇది అన్నారు. 5జీ సేవలు దేశంలో కొత్త శకానికి నాంది పలకనున్నాయని చెప్పారు. డిజిటల్ ఇండియా అనేది నాలుగు స్తంభాలపై ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. డివైజ్ ధర, డిజిటల్ కనెక్టివిటీ, డేటా కాస్ట్, డిజిటల్ ఫస్ట్ అప్రోచ్ గా వాటిని పేర్కొన్నారు. ఈ నాలుగింటి పై తాము పని చేస్తున్నామని చెప్పారు. 2014 - దేశం నుంచి ఒక్క మొబైల్ కూడా ఎగుమతి కాలేదన్న మోదీ.. ఇప్పుడు వేల కోట్ల రూపాయల విలువైన మొబైళ్లను ఎగుమతి చేయగలిగే స్థాయికి చేరుకున్నామని తెలిపారు. ఇది మొబైల్ ధరలు తగ్గేందుకు దోహదం చేసిందని పేర్కొన్నారు. దీంతో తక్కువ ధరకే అనేక ఫీచర్లు - కలిగిన ఫోన్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఒకప్పుడు 1జీబీ డేటా రూ.300 ఉండేదని, ఇప్పుడు అది రూ. 10లకు తగ్గిందని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో ప్రజలు సగటున నెలకు 14 జీబీ వినియోగిస్తున్నారని, ఈ లెక్కన రూ. 4,200 అవ్వాల్సిన చోట రూ. 125-150 మాత్రమే అవుతోందన్నారు. ప్రభుత్వ కృషి వల్లే ఇది

 టెలికాం సేవలు విస్తరించటం వల్ల దేశంలో మూలమూలలకు టెలీమెడిసిన్ ద్వారా ప్రజలకు చికిత్స అందుతోందని ప్రధాని మోదీ అన్నారు. చిన్న వీధి వ్యాపారులు సైతం యూపీఐ చెల్లింపులను అంగీకరిస్తున్నారని అభినందించారు. దళారుల ప్రమేయం లేకుండా ప్రజలు నేరుగా ప్రయోజనాలను పొందగలుగుతున్నారని చెప్పారు. టెక్నాలజీ, టెలికాం రంగంలో జరుగుతున్న అభివృద్ధి ద్వారా పారిశ్రామిక విప్లవం  4.0కు భారత్ నాయకత్వం వహిస్తుందన్నారు. 2014లో కేవలం రెండు మొబైల్ తయారీ పరిశ్రమలే ఉండేవని, ఇప్పుడు ఆ సంఖ్య 200కు చేరిందని ప్రధాని మోదీ చెప్పారు

వ‌చ్చే ఏడాది డిసెంబ‌ర్ నాటికి దేశం న‌లుమూల‌ల రిల‌య‌న్స్ జియో 5జీ సేవ‌లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని   రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేష్ అంబానీ తెలిపారు. కోల్‌క‌తా, ఢిల్లీ, ముంబై, చెన్నై న‌గ‌రాల్లో జియో 5జీ సేవ‌లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని, దీపావ‌ళి నాటికి ఈ న‌గ‌రాల్లో 5జీ సర్వీసులు ల‌భ్య‌మవుతాయ‌ని స్ప‌ష్టం చేశారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు