రోజ్గార్ మేళా ప్రారంభించిన ప్రధాన మంత్రి

 కొలువులు జాతర షురూ 

పది లక్షల ఉద్యోగాలు ఏడాది కాలంలో భర్తి 

 


దేశవ్యాప్తంగా పది లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే  లక్ష్యం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోది ప్రకటించిన  రోజ్ గార్ మేళా పథకం శనివారం ప్రారంభించారు.

 దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలలో రోజ్ గార్ మేళాలు  నిర్వహించి నియామక పత్రాలు అందచేశారు. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోది వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. 

ఎంపికైన అభ్యర్థులు ముప్పై ఎనిమిది మంత్రిత్వ శాఖలు ఇతర విభాగాల్లో వివిధ స్థాయిలలో  విధుల్లో చేరనున్నారు.

ఇందులో గ్రూప్ ఏ గెజిటెడ్ హోదా అధికారుల నుండి గ్రూపు టు నాన్ గెజిటెడి హోదా అధికారులు అట్లాగే  గ్రూప్‌ సి పోస్టుల అధికారులు వున్నారు. 

సాయుధ దళ సిబ్బంది, సబ్ ఇన్ స్పెక్టర్, కానిస్టేబుల్, ఎల్‌డీసీ, స్టెనో, పీఏ, ఇన్ కమ్ టాక్స్ ఇన్ స్పెక్టర్ హోదా వరకు వివిద స్థాయిలఉద్యోగులున్నారు.

దేశ వ్యాప్తంగా వచ్చే ఏడాది కాలంలో మొత్తం పది లక్షల ఉద్యోగాలు రోజ్గార్ మేళాలో భర్తి చేయనున్నారు. 

రెండు వేల ఇరవై మార్చి నాటికి దేశంలో అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల పోస్టులు ఖాళి ఉన్నట్లు గుర్తించారు.

రెండు వేల ఇరవై మూడు నాటికి పది లక్షల ఖాళీలు ఉంటాయని అంచనా వేశారు. 



ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోది మాట్లాడుతు  భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ది ఆర్థికవ్యవస్థగా నిలిచిందని అన్నారు. 

ఎనిమిదేళ్ళ క్రితంపదో స్థానంలోఉన్నదేశం యునైటెడ్కింగ్డమ్ను అధిగమించి ఐదోస్థానంలోకి వచ్చిందని రానున్న రోజుల్లో ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక దేశంగా ఎదుగుతుందని అంచనాలు ఉన్నాయని  ధీమా వ్యక్తం చేశారు.  

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో అనేకదేశాలు తీవ్రఆర్థికసంక్షోభంలో చిక్కుకున్నాయని కాని భారత దేశంలో ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో మెరుగైన ఫలితాలు సాధించామని అన్నారు. శతాబ్దానికి ఒకసారి వచ్చే ఈ మహమ్మారి దుష్ప్రభావం వంద రోజుల్లో పోలేదని అన్నారు.  ఈ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొన్నప్పటికీ  ఈ సమస్య భారిన పడకుండా  దేశాన్ని రక్షించడానికి భారతదేశం కొత్త మార్గాలను అనుసరిస్తోందని అన్నారు.

విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మన్ సుఖ్ మాండవియా, అనురాగ్ ఠాకూర్, పీయూష్ గోయల్ తో పాటు మరికొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గోనున్నారు. ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో నియామక పత్రాలు అందచేసారు.


హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ఆద్యక్షుడు కరీంనగర్ ఎంపీ అయిన బండి సంజయ్ కుమార్ తో పాటు బిజెపి ఎంపీలు డాక్టర్ కె లక్ష్మన్ కేంద్రప్రభుత్వ అధికారుల సమక్షంలో నియామక పత్రాలు అందచేశారు.

ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో  భారతదేశచరిత్రలో ఇది స్థిర స్థాయిగా నిలిచే రోజని అన్నారు.

తెలంగాణ సిఎం కెసిఆర్ఎన్ని ఉద్యోగాలు భర్తి చేశారని ప్రశ్నించారు. 

ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడడం చాలా భాదాకరమన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు