పోలీసులు వీపరీతమైన జులం చేశారు - పవన్ కళ్యాన్

 


మాపై విశాఖలో పోలీసులు విపరీతమైన జులుం చేశారు. అంత సమర్ధులే అయితే వైఎస్ వివేకా కేసును ఎందుకు పరిష్కరించలేకపోయారు? ఏపీ పోలీసులపై మాకు నమ్మకం లేదు అన్న వ్యక్తి కిందే ఇవాళ ఈ పోలీసులు పనిచేస్తున్నారు. మీ శాఖకే గౌరవం ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారంటూ జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శించారు. 

 జనసేన నేతలు లేకుండా జనవాణి కార్యక్రమం నిర్వహించలేమని తమ పార్టి నాయకులు  విడుదలై వచ్చిన తర్వాతే జనవాణి ఉంటుందని అన్నారు. ప్రభుత్వం భేషరతుగా తమ నాయకులను విడుదల చేయాలిని  లేకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. తమది  దీర్ఘకాలిక యుద్ధమని వైసీపీ అనే కాదు, నేరచరితులు రాజకీయాల్లో ఉంటే ఇలాంటి సమస్యలే వస్తాయని  ఆంధ్రప్రదేశ్ కు ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమని అన్నారు.

పోలీసులు నోటీసు జారి చేసిన అనంతరం పవన్ కళ్యాన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ గర్జన కంటే ముందే తాము విశాఖ పర్యటనపై షెడ్యూల్ ఖరారు చేశామని చెప్పారు. మూడ్నెల్ల ముందే జనవాణి కార్యక్రమంపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మా కార్యక్రమాలు ఎప్పుడు జరుపుకోవాలో చెప్పడానికి, మా పార్టీ వ్యవహారాలపై నిర్ణయాలు తీసుకోవడానికి మీరెవరు? అంటూ ప్రశ్నించారు.


జనవాణి అంటేనే జనం తాలూకు గొంతని  అలాంటి ప్రజా గళాన్ని నొక్కేస్తామంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి పార్లమెంటు ఉభయ సభల్లో 30 మంది వరకు బలముందని రాష్ట్ర అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారుని ఇంతమంది ఉండి ప్రభుత్వమే గనుక సమస్యలు పరిష్కరిస్తే ప్రజలు మా దగ్గరకు ఎందుకు వస్తారని ప్రశ్నించారుని. ప్రభుత్వంతో పోటీగా జనవాణి కార్యక్రమం చేపట్టడంలేదని ఎన్నికలప్పుడే తాము  పోటీపడతామని అన్నారు.


నిన్న రాత్రంతా నాకు మెసేజులు వస్తూనే ఉన్నాయని  మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంట... వందల కొద్దీ పోలీసులు హోటల్ వద్ద మోహరించారంట అంటూ వేకువజామున నాలుగున్నర వరకు మా వాళ్లు సందేశాలు పంపిస్తూనే ఉన్నారని గంజాయి దొంగలను వదిలేస్తూ, వాళ్లకు మద్దతు ఇచ్చే రాజకీయ నాయకులను వదిలేస్తూ... సామాన్యుడి గొంతుక వినిపించడానికి వచ్చిన జనసేన నాయకులను మాత్రం ఇబ్బందిపెడతారని మండిపడ్డారు..


తమ పార్టీ తాలూకు కార్యక్రమాలు చేసుకోవడానికే మేం విశాఖ వచ్చాం కాని వికేంద్రీకరణ, మూడు రాజధానులపై మాట్లాడాలన్న ఉద్దేశమే లేదని తాము అమరావతి రాజధానికే కట్టుబడి ఉన్నామని  2014లో విశాఖ రాజధాని అని అని ఉంటే విశాఖ రాజధానికే మద్దతు ఇచ్చేవాళ్లమని  కర్నూలు రాజధాని అనుంటే కర్నూలుకే మద్దతు పలికేవాళ్లమని  రాజు వచ్చినప్పుడల్లా రాజధాని మార్చుతామంటే ఎలా  అని అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు