ఫాంహౌజ్ లో కెసి ఆర్ కలలు
కవిత కేంద్రమంత్రి, కేటీఆర్ తెలంగాణ సీఎం, తాను ప్రధాని అయినట్లు ఫాంహౌస్ లో కెసిఆర్ కలలు కంటున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
పార్లమెంట్ లో తెరాసకు ఇప్పుడున్న 8 సీట్లతో దేశంలో ఎలా చక్రం తిప్పుతారు? కల్వకుంట్ల కుటుంబసభ్యులకు నిద్రలోనూ ఈడీ, సీబీఐ, ఐటీ కనిపిస్తున్నాయి” అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు.
మజ్లిస్ బలో పేతం కోసమే తెలంగాణ సీఎం కేసీఆర్
జాతీయ పార్టీ పెడుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. నెగటివ్ ఆటిట్యూడ్ లో వచ్చే ఏ పార్టీకీ మనుగడ లేదని ఆయన వ్యాఖ్యానించారు.
ఆ పార్టీకి మిగిలిన ఏకైన మిత్ర పక్షం మజ్లిస్ మాత్రమేనన్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ ఎందుకు పెడుతున్నారో తెరాస నేతలకే తెలియదని అన్నారు.
తెరాస పట్ల ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా పెరుగుతోందని రోజురోజుకూ పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించడానికే కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
ప్రజల ఇబ్బందులు, కష్టాలు, తన వైఫల్యాల నుంచి చర్చ మళ్లించి , జాతీయ పార్టీపైన మొదలు పెట్టాలనే వ్యూహంలో భాగంగానే కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో జాతీయ పార్టీపైన తప్ప, కేసీఆర్ వైఫల్యాల మీద, కేసీఆర్ అక్రమాల మీద, కల్వకుంట్ల కుటుంబ అహంకారం మీద చర్చ జరగకూడదనే దుర్మార్గ ఆలోచనతో జాతీయ పార్టీ అని కొత్త నాటకానికి కల్వకుంట్ల కుటుంబం తెరలేపిందని అన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box