గ్రీన్ కార్డు కోసం అమెరికాలో ఏండ్ల తరబడి ఎదురు చూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్.
అమెరికాలో గ్రీన్ కార్డు పొందే వారి కోసం నిభందనలు పూర్తిగా సడలించారు.హెచ్ -1బి వీసాపై వచ్చి అమెరికాలో ఏడేళ్ళు ఉంటే చాలు వారు గ్రీన్ కార్డ్ పొందేందుకు అర్హులు అయ్యేలా తమ ఇమ్మిగ్రేషన్ చట్టంలో మార్పులు చేశారు. ఇకపై గ్రీన్ కార్డ్ పొందాలంటే ప్రవాసులు ఏళ్ళ తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పిన అమెరికా అందుకు అనుగుణంగా కీలక మార్పులు తలపెట్టింది.
వరుసగా ఏడేళ్ల పాటు హెచ్-1బీ వీసాపై పనిచేస్తే గ్రీన్‌కార్డు జారీకి చట్ట సవరణ బిల్లు సెనెట్‌లో ప్రవేశ పెట్టారు. ఇందుకోసం ఇమ్మిగ్రేషన్ యాక్ట్‌లో సవరణలు చేశారు.
ఈ తాజా బిల్లు ప్రకారం ఇకపై అమెరికాలో వరుసగా ఏడేళ్ళు గనుకా పనిచేస్తే వారు గ్రీన్ కార్డ్ పొందడానికి అర్హత సాధించినట్లే.ఈ కీలక బిల్లును అమెరికా సెనేటర్ అలెక్స్ పాడిల్లా ప్రతిపాదించగా, లుజాక్, వారెన్ ,డిక్ దుర్బిన్ అనే మరి ముగ్గురు సెనేటర్లు మద్దతునిచ్చారు.
అమెరికా అంటే భారతీయులకు ఎక్కడ లేని మమకారం. ప్రపంచంలో అన్ని దేశాలకన్నా అమెరికా అంటేనే ఎందుకుంటే పలసల దేశం అది. ఉన్నత చదువులు చదివి అర కొర జీతాలతో పుట్టిన దేశంలో బతక లేక బ్రతుకు దెరువు వెదుక్కుంటూ వెళ్లే దేశాల్లో అమెరికా మొదటిది.
అమెరికా జనాభాతో పోల్చితే భారతీయుల జనభా కేవలం 1 శాతం మాత్రమే. 1990కి పూర్వం భారతీయ సంతతి జనాభా కేవలం 4.5 లక్షల మంది కాగా, 2018 నాటికి వీరు గణనీయంగా 489 శాతం పెరగడం విశేషం. 2000 స్వత్సరాల అనంతరం వలసలు బాగా పెరిగాయి. అమెరికా జనాభా మొత్తం 327 మిలియన్ల కాగా, వీరిలో విదేశీ సంతతికి చెందినవారు 13.7 శాతం లేదా 44.7 మిలియన్లు. గత కొన్నేళ్లుగా విదేశీ సంతతి జనాభా 0.4 శాతం పెరుగుతూ ఉంది. 2010 నాటికి విదేశీ సంతతి జనాభా 40 మిలియన్లు ఉండగా, 2018 నాటికి ఇది 11.8 శాతం మేర పెరిగింది. సీఐఎస్ నివేదిక ప్రకారం 2018 జులై 1 నాటికి అమెరికాలో భారత సంతతి ప్రజలు 2.5 మిలియన్లుగా ఉన్నట్టు తేలింది. అమెరికాలోని మొత్తం విదేశీ సంతతి జనాభాలో భారతీయులు 5.9 శాతంగా ఉన్నారు. ఇది అమెరికా జనాభాలో 1 శాతం.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box