సజ్జల రామకృష్ణా రెడ్డి పూర్వాశ్రమంలో చాలా సంవత్సరాలు జర్నలిస్టుగా పనిచేశారు. మొదటి నుండి వై.ఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. సాక్షి మీడియాలో డైరెక్టర్ హోదాలో కీలక భాద్యతలు నిర్వహించిన సజ్జల రామకృష్ణా రెడ్డి ఆ తర్వాత వై.ఎఎస్ పార్టీ నేతగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా తర్వాత అధికార ప్రతినిధిగా భాద్యతల్లో ఉన్నారు. సిఎం జగన్ తర్వాత చాలా పవర్ ఫుల్ మనిషిగా ముద్ర పడి పోయారు. పార్టి కార్యకలాపాలకు తోడు ప్రభుత్వ కార్యకలాపాలు ఏవి కూడ రామకృష్ణా రెడ్డికి తెలియకుండా జరగవు.
సజ్జల రామకృష్ణా రెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డికి కీలక భాద్యతలు ఇచ్చారు. వై.ఎస్.ఆర్ పార్టి సోషల్ మీడియా ఇన్ చార్జిగా భార్గవ్ రెడ్డిని నియమించారు. మంగళవారం సిఎం కాంపు కార్యాలయంలో భార్గవ్ రెడ్డి సిఎంతో జగన్ ను కలిసారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది పార్టీలు తమ అస్ర్త శస్త్రాలను ముందు సోషల్ మీడియా లో ఎక్కుపెడుతున్నాయి. వై.ఎస్. ఆర్ పార్టి కూడ అందుకు సిద్దం అవుతోంది. ఇందులో భాగంగానే భార్గవ్ రెడ్డికి సోషల్ మీడియా పర్యవేక్షణ భాద్యతలు అప్పగించారు.
భార్గవ్ రెడ్డికి సిఎం జగన్ సోషల్ మీడియాకు సంభందించిన పలు కీలక సూచనలు చేసినట్లు సమాచారం.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box