అంబులెన్సు కోసం కాన్వాయ్ నిలిపి దారిచ్చిన ప్రధాని

 


విఐపీలు ఇంకా వివిఐపీలు అంటే అధికార పీఠాల్లో అత్యంత హోదాల్లో ఉన్న  ప్రముఖులు. వారి పర్యటనలంటే గంటల కొద్ది ట్రాఫిక్ ఎక్కడి కక్కడ నిలిపి వేడయం జనాల భాదల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా ఆంక్షలు విధించడం పరిపాటైంది. అత్యవసర సేవలకు ఆ మార్గాల్లో  అంబులెన్సులు వెళ్లాలన్నా దారి ఉండని పరిస్థితులు తలెత్తుతుంటాయి.   గుజరాత్ లో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోది పర్యటనలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.

గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి  నరేంద్ర మోది శుక్రవారం ఆహ్మదాబాద్ నుండి గాంధి నగర్ వరకు   రోడ్డు మార్గం గుండా ప్రయాణించారు. పరధాని  కాన్వాయ్ లో వెళుతుండగా  వెనకాల నుండి ఓ అంబులెన్సు సైరన్ తో రావడం ప్రధాన మంత్రి నరేంద్ర మోది స్వయంగా గమనించారు. వెంటనే వాహనాన్ని  ఎడమ వైపుకు తీసు నిలిపి వేసి అంబులెన్సుకు దారి ఇవ్వాలని ఆదేశించారు. ప్రధాన మంత్రి ప్రయాణించే వాహనం రోడ్డుకు ఎడమ వైపు నిలవడంతో  వాహనశ్రేణిలో వెనక ఉన్న వాహనాలన్ని అంబులెన్సుకు దారి ఇస్తూ  పక్కకు నిలిచి పోయాయి.   

ప్రధాన మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తు నెటిజెన్లు ట్వీట్ చేశారు. 

గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గాంధీ న‌గ‌ర్‌- ముంబైల మ‌ధ్య సెమీ హైస్పీడ్ వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలును మోదీ శుక్రవారం  ప్రారంభించారు.  సంగ‌తి తెలిసిందే. ఇందుకోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో  తొలుత అహ్మ‌దాబాద్ చేరుకున్న మోదీ అహ్మ‌దాబాద్ నుంచి రోడ్డు మార్గం మీదుగా గాంధీ న‌గ‌ర్‌కు బ‌య‌లు దేరారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు