తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్ గా భాద్యతలు చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా రాజ్ భవన్ లో గవర్నర్ మీడియాతో మాట్లాడారు.
గవర్నర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస ప్రోటోకాల్ పాటించ లేదన్నారు. ఇది అనేక సందర్భాల్లో బయట పడిందని, ప్రభుత్వం చాలాసార్లు తనను ఇబ్బందిపెట్టిందన్నారు. అయినా తాను భయపడలేదని చెప్పారు. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారని ప్రశ్నించారు.
"రాజ్‌భవన్ అంటరాని ప్రాంతమా? కెసిఆర్ కు గవర్నర్‌పై ఎందుకీ కక్ష ? " అని ప్రశ్నించారు.
మహిళా గవర్నర్‌గా తనను చాలా తక్కువ అంచనా వేశారని, ఒక మహిళగా పురుషుల కంటే ఎక్కువగా కష్టపడి పని చేయగలనని చెప్పారు. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ప్రభుత్వాన్ని హెలీకాఫ్టర్ అడిగితే ఇవ్వలేదన్నారు. చివరి క్షణం వరకు రాష్ట్ర ప్రభుత్వం తనకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని.. అయినా దాదాపు ఎనిమిది గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణం చేసి గిరిజన ప్రజల ఆరాధ్య దైవం సమ్మక్క సారలమ్మ దగ్గరకు చేరానని గవర్నర్ తమిళి సై తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంత వివక్ష చూపించినా.. గౌరవం ఇవ్వకపోయినా తన పని తాను చేసుకుని పోతానని అన్నారు.
ఈ మూడేళ్లలో రాజ్‌భవన్‌ను ప్రజా భవన్‌గా తీర్చిదిద్ది ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాను. ఎన్నో యూనివర్శిటీలు, విద్యా సంస్థల్లో పర్యటించి సమస్యలు తెలుుసుకున్నా. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వెతలు చూసి చలించిపోయా. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని గవర్నర్ హోదాలో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే కనీస స్పందన లేదు అని అన్నారు.
సదరన్ కౌన్సిల్ భేటీలో విభజన సమస్యలు ప్రస్తావించే వీలున్నా ఎందుకు పట్టించుకోలేదు. అసలు ఆ సమావేశానికి కేసీఆర్ ఎందుకు వెళ్లలేదు. నిద్రపోయేవాళ్లని లేపొచ్చు. నిద్రపోతున్నట్లు నటించేవాళ్లని లేపలేం. గవర్నర్‌గా నా పరిధి మేరకు పనిచేస్తున్నా. ఏనాడూ నా పరిధి దాటి ప్రవర్తించలేదు. గవర్నర్ కార్యాలయంపై తీవ్ర వివక్ష చూపుతున్నారు. ఎట్ హోం వస్తున్నానని సమాచారం ఇచ్చిన ముఖ్యమంత్రి సడెన్‌గా రద్దు చేసుకోవడం మంచి పద్దతేనా?. నేను ప్రజలను కలవాలనుకున్న ప్రతిసారి ఏదొక అడ్డంకి ఎదురవుతోందన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box