వైద్యులను దేవుళ్లతో సమానంగా ఆరాధించే దేశం మనది. వైద్య వృత్తిలోకి డబ్బు సంపాదనే ధ్యేయంగా వస్తున్న కొందరు వైద్యులు ఉండి ఉండ వచ్చుకాని అందరూ అట్లాగే ఉండరు. వైద్యవృత్తిని ఎంతో ఇష్టంతో నిర్వహిస్తు తమ విద్యుక్త ధర్మాన్ని పాటిస్తు రోగుల ప్రాణాలు కాపాడే వైద్యులు ఉన్నారని నిరూపించారు బెంగుళూరుకు చెందిన డాక్టర్ గోవింద్ నందకుమార్. భారి వర్షాల కారణంగా సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలిచే బెంగుళురు అతలా కుతలం అయింది.
కాలనీలను వరద నీరు ముంచెత్తింది. పెద్ద పెద్ద సాఫ్ఠ్ వేర్ కంపెనీల సిఇవోలు ట్రక్కులు, ట్రాక్టర్లపై లగేజి వేసుకుని ఆఫీసులకు చేరుకున్న దృష్యాలు చూశాం. వర్షాలకు మెయిన్ రోడ్లన్ని ట్రాఫిక్ జామ్ తో గంటల కొద్ది వాహనాలు నిలిచి పోయాయి.
సరిగ్గా ఇలాంటి పరిస్థితిలో ఓ వైద్యుడు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కపోయాడు. హాస్పిటల్ లో తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న పేషెంట్ కు అత్యవసర ల్యాప్రోస్కోపిక్ పిత్తాశయ సర్జరీ చేసేందుకు సర్జాపూర్ ఏరియాలోని మణిపాల్ ఆసుపత్రికి తన కారులో బయలు దేరిన డాక్టర్ గోవింద్ నందకుమార్ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్క పోయాడు. ఆసుపత్రిలో ఆపరేషన్ కోసం అన్ని సిద్దం చేసి డాక్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడేం చేయాలని ఆలోచించి కారు దిగి ఆ డాక్టర్ ఆసుపత్రికి పరుగులు దీశాడు. మూడు కిలోమీటర్ల దూరంలో గల ఆసుపత్రికి 45 నిమిషాలు ఏగ ధాటిగా ఎక్కడా ఆగకుండా పరుగుల తీసి అసుపత్రికి చేరుకుని ఆపరేషన్ చేసాడు.ఏమాత్రం ఆలస్యం అయినా పేషంట్ ప్రామాలు నిలిచేవి కావు.
డాక్టర్ గోవింద్ నందకుమార్ తనకు ఎదురైన అనుభవాన్ని ట్టిట్టర్ లో పోస్టు చేయడంతో ఆలస్యంగా వెలుగు చూసింది. డాక్టర్ ను అందరూ అభినందించకుండా ఉండ లేక పోయారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box