కాంగ్రేస్ నేత కొండా మురళీ ధర్ రావును కల్సిన లండన్ ఎన్ఆర్ఐ ఫోరం అధ్యక్షులు శ్రీధర్ నీల
వరంగల్ ఎన్నారై ఫోరమ్ లండన్ - యుకె అధ్యక్షులు శ్రీధర్ నీల కాంగ్రేస్ పార్టి నేత కొండా మురళీ ధర్ రావును హన్మకొండ - రాంనగర్ లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసారు. లండన్ లో కుటుంబ సబ్యులతో స్థిరపడి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న శ్రీధర్ నీల నూతన గృహ ప్రవేశం సందర్బంగా తన స్వంత నగరం వరంగల్ కు వచ్చారు.
కొండా మురళి ధరా రావుతో సన్నిహిత సంభందాలు కలిగిన శ్రీధర్ నీల ఆయనను కల్సి ఎన్ఆర్ ఐ ఫోరం తరపున మెమెంటో అంద చేసి శాలువాతో సత్కరించారు.
పేద ప్రజల కోసం అహర్నిశలూ కృషి చేస్తున్న కొండా మురళీ ధర్ రావు సేవలు సమజానికి ఎంతో అవసరమని శ్రీధర్ నీల కొనియాడారు. లండన్ లో స్థిరపడిన వరంగల్ వాసులు జిల్లాలో చేపట్టి అమలు చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను వివరించారు. లండన్ ఎన్ఆర్ ఐ ఫోరం సేవలను తెల్సుకున్న కొండా మురళి ధర్ రావు ఫోరం అద్యక్షులు శ్రీధర్ నీలను అభినందించారు. ఫోరం కు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పడూ అంద చేస్తానని తెలిపారు.
వేసవి సెలవుల్లో లండన్ పర్యటనకు వచ్చేది ఉందని ఈ సారి తప్పనిసరిగా వరంగల్ ఎన్ ఆర్ ఐ ఫోరం భాద్యులతో సమావేశం అవుతానని కొండా మురళి ధర్ రావు తెలిపారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box