వికారాబాద్ లో కెసిఆర్ ఘాటు విమర్శలు
మోదీ 8 ఏళ్ల పాలనలో చేసిందేమీ లేదని సంస్కరణల పేరుతో మనకు శఠగోపం పెట్టి షావుకార్లకు నింపుతున్నారని సిఎం కెసిఆర్ విమర్శించారు. సాక్ష్యాత్తు ప్రధాన మంత్రే తెలంగాణకు శత్రువు అయ్యారని ఆరోపించారు.
వికారాబాద్ లో మంగళవారం సిఎం కెసిఆర్ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌తో పాటు టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద టీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత ఉస్మానియా మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
" ప్రధాని నిన్న గంట మాట్లాడారు. అంతా గ్యాసే. నెత్తికి రుమాల్ కట్టి వేషం తప్ప ఏముంది. డైలాగులు తప్ప దేశానికి మంచిమాట ఉందా " అంటూ కెసిఆర్ ప్రశ్నించారు. బీజేపీ జెండా పట్టుకొని నా బస్‌కు అడ్డం వసార్తా?. వికారాబాద్‌కు నేనేం తక్కువ చేశానో ప్రజలు చెప్పాలన్నారు. బీజేపీని నమ్ముకుంటే మనకు మళ్లీ పాత రోజులే వస్తాయని అన్నారు.
ఏ రాష్ట్రంలో లేనన్ని పథకాలు తెలంగాణలో ఉన్నాయని రైతు బీమాతో రైతు కుటుంబాలకు అండగా ఉంటున్నామని రైతాంగాన్ని కాపాడుకోవాలని, పల్లె సీమలు కళకళలాడాలనేదే తన ఉద్ధేశమని అన్నారు. నీటి బకాయిలు మాఫీ చేశామని తెలంగాణ పల్లెలన్నీ పచ్చగా కనిపిస్తున్నాయని సంక్షేమ పథకాలను ఉచితాలంటూ కేంద్రం ప్రచారం చేస్తోందిని ఉచిత పథకాలు రద్దుచేయాలంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోందని వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని చెబుతోందని తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని సిఎం కెసిఆర్ హెచ్చరించారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box