సమాఖ్య స్ఫూర్తి - ఆర్థిక కోణం

 జనాభా అదుపులో పెట్టుకుని,వారి సామర్థ్యాన్నిపెంచుకొని, అత్యధి క ఆదాయాన్ని ఉత్పత్తిని పెంచుతున్నటు వంటి దక్షిణాధి మరియు పశ్చిమాది రాష్ట్రాలు కేంద్రానికి సంపాదించిపెడుతున్నటు వంటి ఒక రూపాయి పన్నులో, తిరిగి వాటికి 30 పైసలు ఇస్తే,  అసమర్ధ పాలన ఉన్నటు వంటి యూపీ, మధ్యప్రదేశ్, మాహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు  వారి సంపాదన లో ఒక రూపాయికి రెండు నుంచి నాలుగు రూపాయలు పంచి పెట్టడం జరుగుతుందని ఆర్థికవేత్తలు లెక్కలుతీశారు. 



భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ఆర్థిక విధానాలలో చాలా మార్పులు తీసుకు వచ్చింది. అందులో ముఖ్యమైనవి నీతి ఆయోగ్, డిమానిటైజేషన్, జిఎస్టిచట్టం. వీటన్నిటి ముఖ్య ఉద్దేశం కేంద్రానికి ఎక్కువ ఆదాయాన్నితీసుకువచ్చేప్రయత్నం. అందులోతప్పేమీలేదు. కానీ దాని వల్ల రాజకీయంగా కూడా లాభం ఉందని ఎవరు ఊహించి ఉండరు. కేంద్రం దగ్గర ఆర్థికం ఎక్కువైనప్పుడు కేంద్రప్రాయోజిత కార్యక్రమాల ద్వారా ఓటర్లను ఆకర్షించుకోవచ్చు. అంతేకాకుండా అస్మదీయులకు పెద్దపెద్ద ప్రాజెక్టులు ప్రారంభించి వారికి అందజేసి వారి ద్వారా పరోక్షంగా రాజకీయ ఆమ్యామ్యాలకు ఖర్చులు ఖర్చుపెట్టించుకోవచ్చు. వారి ద్వారా బాండ్లు కొనిపించు కోవచ్చు.  

కానీ సమైక్యస్ఫూర్తి మీద అనర్ఘలంగా గంటల కొద్ది మాట్లాడినటువంటి నాయకులు అలాంటి వనరులు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అవసరం ఉంటాయనే మంచి భావన కలిగి ఉంటే మంచిది. కానీ అది కొరవడింది అనేనిజం. 2019 లో కేంద్రం అధ్వర్యంలోని అకౌంటెంట్ జనరల్ గణాంకాల పరిశీలన ద్వారా  ద్వారా తెలియవస్తుంది. 

ప్రజలకు చాలా కాలం నుండి ప్రభుత్వాల నుంచి వచ్చే సంక్షేమం లాభాలు ఉచితాల మీద ఎంతో కొంత ఆధార పడడం అలవాటయింది. ప్రజల్నిస్వతంత్రులుగా చేయడం ప్రభుత్వాలకు ఇష్టంలేదు. ఇది మన అనారోగ్య ప్రజాస్వామిక పోటి రాజకీయాల్లో ఒక వ్యసనం లాంటి ఆచారంఅయి పోయింది. ఆఆచారానికి మేమువిరుద్ధమని, ప్రతిసంవత్సరం రెండుకోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని, ప్రజల్నిస్వతంత్రులుచేస్తామని చెప్పకువచ్చినటువంటి బిజెపి కూడా ఈ ఆచారాన్ని తూచాతప్పకుండా అవలంబిస్తుంది. 

అందుకేమతాన్నిఉపయోగించుకుని అధికారానికి వచ్చిన తర్వాత అవలంబించిన ఆర్థికవిధానాల్లో కేంద్ర ఆర్థిక ఆదాయం పెంచి తద్వారా రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థలను నిర్వీర్యం చేసి వారిని గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుందేమోననిఅనిపిస్తోంది.

కేంద్రం తన ఆదాయాలు ఎక్కువైపోతే కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందజేయ వలసినటువంటి ఉచితాలు లాభాలను పెంచి, ఎక్కువ రాష్ట్రాల్లో వీలైతే భారతదేశం మొత్తం వారి అధికారాన్నిచలాయించాలనేటటువంటి ఒక భావన ఈకేంద్ర ఆర్థిక వనరులను పెంచుకోవడంలో నిగూఢంగా ఉందనేది ఊహకాదు. అది  2019 ఫైనాన్స్  కమీషన్   చూస్తే మనకు స్పష్టం అవుతుంది

 ఉదాహరణకి 2019లో దేశం మొత్తంలో వసూలు చేసిన ఆదాయంలోకేంద్రం శాతం 63 గా ఉంటే రాష్ట్రాల శాతం 38 కిపడిపోయింది. కానీ దేశ అభివృద్ధికి సంబంధించిన ఖర్చుల్లో మాత్రం రాష్ట్రాల్లో 67 శాతంఉంటే కేంద్రంలో 33 శాతం ఉంది. అంటే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఆర్థిక రంగాల్లో తీసుకు వచ్చిన పెను మార్పుల ప్రభావం ఏంటంటే వనరులు సమకూర్చుకోవడంలో ఎక్కువ శాతం ఖర్చులు తక్కువశాతం అయ్యాయన్న మాట.

అదేవిధంగా కేంద్రఫైనాన్స్ కమీషన్ సూచించిన విధంగా కేంద్ర మొత్తం పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో 41 శాతం రాష్ట్రాలకు ఇవ్వాలి కానీ ఇది సగటుగా 29.6% మించలేదని ఒకే ఒకసంవత్సరంలో 36% పెరిగిందని ఏసంవత్సరంలో కూడా నిర్ధారించిన శాతానికి కేంద్రాల నుండి రాష్ట్రాలకు పన్ను పంపకాలు జరగ లేదని విధిత మవుతుంది.

 2019-21 మధ్య, దేశంలో వసూలు చేసిన మొత్తం పన్నులలో  రాష్ట్రవంతు మూడు శాతం పడిపోగా కేంద్ర ప్రభుత్వశాతం మూడు శాతం పెరిగింది.

ఇక పోతే పంచుకోవాల్సిన అవసరం లేనటు వంటి విద్యకోసం, ముడి ఇంధన నూనెల అభివృద్ధి కోసం ఇతర కారణాల కోసం వేసినటువంటి సెస్, సర్చార్జీలు(పన్నులపైపన్ను) యొక్క శాతం మొత్తం గణనీయంగాపెరిగింది. ఈ సెస్సు అనేది ప్రత్యేక రంగాల అభివృద్ధి కోసంవేసినవి. వాటి మీద వచ్చిన ఆదాయ మంతా ఒకప్రత్యేక ఖాతాలో ఉంచి వాటిని ఆయా రంగాల అభివృద్ధికి మాత్రమే ఖర్చుచేయాలి.  కానీ అలా జరగడం లేదు. ఉదాహరణకి ఇందన అభివృద్ధి కోసం ఒక ఇంధనాభివృద్ధి బోర్డును స్థాపించి దాని నిమిత్తం వేసిన సెస్ ఆబోర్డు ద్వారా ఇంధనాభివృద్ధి పెంచుకునేందుకు ఉపయోగించాలి. .  ఆఖాతా కింద వచ్చి నఆదాయంలో 40 శాతం మాత్రమే ఆబోర్డుకి ఇవ్వబడింది. మిగతా 60% కేంద్రం తమ ఖర్చుల నిమిత్తమేవాడుకుందని దాని అర్థం.

2010 నుండి 2020 మధ్యకాలంలో ముడి ఇంధన నూనెల మీద1.28 వేలకోట్ల రూపాయలు సెస్సుల రూపంలో వచ్చాయి అంటేఈ రకంగాకేంద్రానికి ఎంతపెద్దమొత్తంలో రాష్ట్రాలకు పంచన వసరంలేని వనరులు సమకూర్చుకోబడుతున్నాయో తెలుస్తుంది. అవిసెస్సులు కట్టేవి మాత్రం అన్నిరాష్ట్రాలు, ముఖ్యంగా అధిక అభివృద్ధి ఆదాయం సంపాదిస్తున్నటువంటి దక్షిణాది, పశ్చిమాది రాష్ట్రాల ప్రజలే. ఈ విధంగారాష్ట్రాల నోళ్లల్లో కొంత మన్నుకొట్టడం జరుగుతుందనేది నిర్వివాదంశం.  

అదేవిధంగా ఆర్థికసంవత్సరం 2019లో 1,10,000 కోట్లుసెస్సు వసూలైన అవిఏ ఫన్డుకు పంపలేదు. అదే సంవత్సరం సాంఘిక సంక్షేమం నిమిత్తం సెస్సు రూపంలో వసూలు చేసిన 8710 కోట్లు వసూలు చేసి దాని నిమిత్తం ఏర్పరచ వలసిన ఫండుకు కేటాయించాలి . అసలు ఆ ఫండే ఏర్పరచ లేదు. అంతే కాకుండా జనాభా అదుపులో పెట్టుకుని,వారి సామర్థ్యాన్నిపెంచుకొని, అత్యధి క ఆదాయాన్ని ఉత్పత్తిని పెంచుతున్నటు వంటి దక్షిణాధి మరియు పశ్చిమాది రాష్ట్రాలు కేంద్రానికి సంపాదించిపెడుతున్నటు వంటి ఒక రూపాయి పన్నులో, తిరిగి వాటికి 30 పైసలు ఇస్తే,  అసమర్ధ పాలన ఉన్నటు వంటి యూపీ, మధ్యప్రదేశ్, మాహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు  వారి సంపాదన లో ఒక రూపాయికి రెండు నుంచి నాలుగు రూపాయలు పంచి పెట్టడం జరుగుతుందని ఆర్థికవేత్తలు లెక్కలుతీశారు. అంతేకాకుండా ఈవిధంగా అధిక వనరులు కేంద్రాల నుంచి లభిస్తున్నప్పటికీ, కూడా ఆరాష్ట్రాల్లో తగినంత ఉపాధి కల్పించ లే కపోవడం వల్ల ఆదక్షిణాది నుండి రాష్ట్రాలకు పశ్చిమ రాష్ట్రాలకు లక్షల్లో ప్రజలు ఉపాధి కోసం రావడం ఇక్కడ ఉన్న ప్రజల ఉపాధికి కొంత గండి కొట్టడం జరుగుతుంది. ఇది ఘర్షణలకు దారితీస్తుంది. ఈఘర్షణల ప్రభావమే కదా శివసేన పుట్టుక. కేరళలో 25 రాష్ట్రాలనుండి వచ్చిన వలస కార్మికులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో  12 రాష్ట్రాల నుంచి వలసలు వచ్చి పని చేస్తున్నారు.

ప్రజలు ఒకరాష్ట్రం నుండి ఇంకొక రాష్ట్రానికి పోయి పని చేయ కూడదని కాదు. చేయాలి కూడా. దాని ద్వారా భారతదేశ ప్రజల ఐక్యత కుబలం చేకూరుతుంది. కానీ ఏ రాష్ట్రాలు కష్టపడే అభివృద్ధి చేసి ఇతర రాష్ట్రాల ప్రజలకు ఉపాధికల్పిస్తున్నాయో, వారికిసాధ్యమైనంత వరకు వనరులను ఇతర అవకాశాలను కల్పించేది పోయి ఆరాష్ట్రాలను విమర్శిస్తూ ఆరాష్ట్రాల్లోరాజకీయ లబ్ది కోసం ఆరాష్ట్రాలను కట్టడి చేయడం అందు కోసం ఆర్థి కవిధానాలను తప్పుగా వాడు కోవడం సరి అయిన పద్ధతి కాదు.

సహకార సంఘంసమాఖ్యస్ఫూర్తి, సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే నినాదాలు ప్రతి రాజకీయ వేదిక నుంచి వల్లిస్తున్నప్పటికీ వాటిస్ఫూర్తి ప్రభుత్వాధి కార గణాంకాలలో ప్రతిభింబించడం లేదు.

ఇలాంటి పరిస్థితులలో  కెసిఆర్ లాంటి వాళ్లు  నీతి ఆయోగ్ సమావేశాలకు హాజరు కాక పోవడంలో  ఆక్షేపనీయం ఏది లేదు.



Drమండువప్రసాదరావు

 9963013078


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు