బి.సి చౌక్ పుస్తకావిష్కరణ
మానవ పురోభివృద్ధికి ఎనలేని కృషి చేసిన ఉత్పత్తి కులాల చరిత్రకు సంబంధించిన సాహిత్యాన్ని మరింత తీసుకురావాలని ప్రముఖ కవి, రచయిత్రి దాసోజు లలిత, అరుణోదయ విమలక్క లు అన్నారు. సోమవారం యువ కవి చింతం ప్రవీణ్ కుమార్ రచించిన బి.సి చౌక్ పుస్తకాన్ని వివిధ ప్రజా సంఘాల సమక్షంలో హన్మకొండ జిల్లా కేంద్రం హంటర్ రోడ్ లోని అభిరామ్ గార్డెన్ లో ఆవిష్కరించి వారు ఆవిష్కరించి మాట్లాడారు. సర్వ చాకిరి చేసే బి.సి కులాల త్యాగ చరిత్రను పుస్తక రూపంలో తెచ్చిన చింతం ప్రవీణ్ కుమార్ మరిన్ని పుస్తకాలను తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బి.సి. సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కోలా జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో బి.సి లకు జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో, విద్య, ఉద్యోగాల్లో దక్కవలసిన వాటా కోసం దేశ వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్న నేటి రోజుల్లో బి.సి ల చరిత్రపై చింత ప్రవీణ్ బి.సి చౌక్ పుస్తకాన్ని తీసుకురావడం వల్ల ఉద్యమానికి ఎంతో మేలు జరుగుతుందని, బహుజనుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో బి.సి ల స్థితి దయనీయంగా. మారిందని బి.సి ల సమస్యల సాధనకు, రాజ్యాధికార ఉద్యమానికి ఉపయోగపడే మరిన్ని రచనలను చింతం ప్రవీణ్ కుమార్ తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమానికి హాజరైన కవి యోచన, బి.సి స్టడీ ఫోరం వ్యవస్థాపక చైర్మన్, మహాత్మా జ్యోతిరావు పూలే అవార్డు గ్రహిత సాయిని నరేందర్, పీపుల్స్ డెమొక్రాటిక్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ సోమ రామమూర్తి, న్యాయవాది తీగల జీవన్ గౌడ్, రాజబాపు, ప్రముఖ కవి అన్వర్, బి.సి బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ప్రతాపగిరి విజయ్ కుమార్, నలిగింటి చంద్రమౌళి, సంతోష్, గుంటి రవి, రాంబాబు, జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box