దోమ కాటు ప్రాణాంతకమా ? ఈ ప్రశ్న అందరికి ఆశ్చర్యం కలిగించవచ్చు కాని ఇది నిజమేనని ఓ సంఘటన రుజువుచేసింది. దోమ కాటుతో ఓ మనిషి మృత్యువాత పడాల్సి వచ్చింది. దోమకాటుతో మత్యవాత పడిన విషయం ఏడాది తర్వాత కాని వెల్లడి కాలేదు. బ్రిటన్ లోని సఫల్క్ కి చెందిన ఒరియానో పెప్పర్ అనే యువతి ట్రైనీ పైలెట్ గా పనిచేసేది. పైలట్ ట్రైనింగ్ కోసం 2021 లో బెల్జియంలోని యాంట్ వెర్ప్‌కు వెళ్లింది. శిక్షణ సమయంలో ఆమె ఫ్లైట్ లో పైలట్ శీటులో ఉండగా పలు మార్లు దోమలు కాటు వేశాయి. దోమల కాటుకుకు ఆమె ముఖం మీద, కంటిదగ్గర దద్దుర్లతో వాపులు వచ్చాయి. దోమ కాటును లైట్ తీసుకుని అవే తగ్గి పోతాయిలే అనుకుంది. కాని రోజులు గడిచిన కొద్ది వాపులు తగ్గకపోగా మరింతగా పెరిగి పోవడంతో ఆమెన ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. గోమ కాటును చూసి డాక్టర్ యాంటిబయోటికిస్ ఇచ్చి వాడమని చెప్పి ఇంటికి పంపించారు. ఆతర్వాత రెండు రోజులకు ఆమె పరిస్థితి విషమించింది. కుటుంబ సబ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మార్చి జులై 12,2021న చనిపోయింది. ఒరియానో పెప్పర్ మృతి డాక్టర్లకు అంతు పట్టలేదు. పరిశోదన కోసం శవపరీక్ష నిర్వహించి మృత దేహాన్ని కుటుంబ సబ్యులకు అంద చేసారు.
వైద్య పరిశోదన రిపోర్టు ఇటీవల రావడంతో దాన్ని పరిశీలించిన వైద్యులు షాక్ అయ్యారు. దోమకాటుకు ఇన్ ఫెక్షన్ అయి మెదడుకు పాకడంతో మృతి చెందినట్లు వైద్య పరిశోదన రిపోర్టు ద్వారా వెల్లడి అయింది. అరుదుగా ఇలాంటి సంఘటనలు కొద్ది మందికి జరుగుతుంటాయని వైద్యులు తెలిపారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box