అధికార నివాసంలోకి దూసుకెళ్లిన ఆందోళన కారులు
తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ప్రజాగ్రహం నానాటికీ పెల్లుబికింది. ఆందోళన కారులు శనివారం అధ్యక్షుడు గొటబాయి రాజపక్స అధికారిక నివాసం లోకి భారి భద్రతను చేదించి దూసుకు పోయారు. దాంతో దేశాద్యక్షుఢు గొటబాయ రాజపక్స అక్కడి నుండి ఫరరీ అయ్యాడు. ఆందోళన కారుల కంట పడకుండ భద్రతా దళాలు రహస్య ప్రదేశానికి తరలించి ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన సోదరుడు మహీంద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స కూడ తన పదవికి రాజీనామా చేయాలని ఆందోళన కారులు కొలంబోలో భారి ప్రదర్శన తల పెట్టారు.
ఆయన నివాసాన్ని చుట్టుముట్టి భద్రతను ఛేదించి దూసుకు పోయారు. నివాసంలోకి దూసుకెళ్లిన ఆందోళన కారులపై భద్రతాదళాలు భాష్పవాయు ప్రయోగించారు. అయినా ఆందోళన కారులు వెనక్కి తగ్గలేదు. భాష్పవాయు గోళాలు తాకి 20 మంది గాయ పడ్డారు. ఆందోళన కారులను భద్రతా దళాలు నిలువ రించిన క్రమంలోనే దేశాద్యక్షుడు ఆయన తన నివాసం నుంచి బతుకు జీవుడా అంటూ ఫరారయ్యాడు. గొటబాయ రాజపక్స సురక్షితంగా అక్కడి నుంచి వెళ్లిపోయారని రక్షణశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించాడు. గత కొన్ని నెలలుగా ఆహారం, ఇంధన సమస్యతో శ్రీలంక అట్టుడుకుతోంది. ద్రవ్యోల్బణం అంతకంతకు పెరుగుతోంది. దీంతో దేశ వ్యాప్తంగా ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు.
శ్రీలంక సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో తెలియని గందరగోళం నెలకొంది. ఆహార ధాన్యాల కొరత తీవ్రతర మైంది.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box