ద్రౌపది ముర్ముకే శివసేనమద్దతు - ఉద్దవ్ థాకరే

 


రాష్ట్రపతి ఎన్నికల్లో  శివసేన ఎన్డిఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించింది.  గత రెండు రోజులుగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, గిరిజనులతో సహా ఇతర నేతలతో వరుస సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని శివ సేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ద్రౌపది ముర్ముకు శివ సేన మద్దతు ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు ఊహించిందే.  అయితే ముర్ముకు మద్దతు ప్రకటింంచడం వెనక పార్టి ఎంపీల వత్తిడి లేదని థాకరే స్పష్టం చేసారు.

"మీడియాలో వస్తున్న రక రకాల వార్త కాథనాలలో పేర్కొన్నట్లుగా ఎంపీల నుండి ఎటువంటి ఒత్తిళ్లు లేవు.  చాలా మంది సేన నాయకులు,  గిరిజన సంఘాలకు చెందిన ఆఫీస్ బేరర్లు  అభ్యర్థించిన మేరకు  రాష్ట్రపతి ఎన్నికలలో ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని మేము నిర్ణయం తీసుకున్నాము" అని థాకరే మీడియా ప్రతినిధులకు తెలిపారు.

గతంలో ఎన్డీయేతో కలిసి ఉన్నసందర్భంలో  రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రత్యర్థి అభ్యర్థులకు మద్దతిచ్చిన విషయాన్ని సేన అధినేత గుర్తు చేసారు. "మొదటిసారిగా ఒక గిరిజన మహిళ దేశ అత్యున్నత పదవిని చేపట్ట బోతున్నారు. ఈ విషయంలో విశాల ప్రాతిపదికన  కుంచిత ఆలోచనలకు వెళ్లకుండా  ఆమె అభ్యర్థిత్వానికి మదద్తు ఇస్తున్నాం.. గతంలో కూడా మేము ప్రతిభా పాటిల్ (2007) ప్రణబ్ ముఖర్జీ (2012) అభ్యర్థిత్వాలకు  మద్దతు ఇచ్చామని థాకరే వివరించారు.

ముర్ముకు మద్దతు ఇవ్వడం అంటే భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం కాదని ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నామని పార్టి ఎంపి అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. 

లోక్‌సభ మరియు రాజ్యసభకు చెందిన చాలా మంది శివసేన ఎంపీలతో పాటు మరికొందరు అగ్రనేతల సమావేశంలో ఠాక్రే రాష్ట్రపతి ఎన్నికల అంశం మరియు ఇతర విషయాలను వివరంగా చర్చించారని రౌత్  తెలిపారు.

"గతంలో బాలాసాహెబ్ ఠాక్రే కూడా పార్టీ నాయకులతో ప్రధాన సమస్యలపై ఇటువంటి సంప్రదింపులు జరిపేవారని   సహచరుల అభిప్రాయం ఆధారంగా నిర్ణయాలు తీసుకునేవారని అదే రీతిలో  ముర్ము అభ్యర్థిత్వంపై కూడా చర్చించారని రౌత్ చెప్పారు.

"నిన్నటి సమావేశంలో షిండే కుమారుడు డాక్టర్ శ్రీకాంత్ షిండే మరియు భావనా ​​గవాలీని మినహాయించి మెజారిటీ ఎంపీలు హాజరయ్యారు. పార్టీ ఒత్తిడికి లోబడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోదు, చివరకు ఏది నిర్ణయించినా అది ఎంపీలు మరియు ఎమ్మెల్యేలందరికీ కట్టుబడి ఉంటుంది" అని రౌత్ చెప్పారు. .

ద్రౌపది  ముర్ము అదే విదంగా  సిన్హా ఇద్దరూ రాష్ట్రపతి ఎన్నికల ప్రచారానికి ఈ వారంలో ముంబైకిరోబాతున్నారు.   అన్ని రాజకీయ పార్టీల అగ్ర నాయకులను వారివురు కలిసే అవకాశం ఉంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు