90 సీట్లు మావే - కెసిఆర్ సిఎంగా హాట్రిక్ సాధించి బోతున్నారు- మీడియా ఇష్టా గోష్టిలో కెటిఆర్

 

 

తాము చేయించిన సర్వే ప్రకారం తమకు 90 సీట్లు పైగా వస్తాయని దక్షిణ భారతం లో కెసిఆర్ హ్యాట్రిక్ విజయం సాధించబోతున్న మొదటి సీఎంగా నిలుస్తారని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ప్రత్యర్థి పార్టీలు చేయించిన సర్వేలలో సైతం తమ పార్టి గెలవబోతున్నట్లు స్పష్టంగా  ఫలితాలు వచ్చాయని అన్నారు.  టీఆర్ఎస్ హవా రాష్ట్రం మొత్తంగా ఉందన్నారు. కాంగ్రెస్ - బీజేపీ పార్టీలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చేసే స్థాయిలో లేవన్నారు.  నిర్ణీత స‌మ‌యానికే 2023 లో తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని  కెటిఆర్ స్పష్టం చేసారు.

కెటిఆర్ శుక్రవారం మీడియాతో జరిగిన ఇష్టాగోష్టిలో మాట్లాడారు. 

రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై మాట్లాడుతు   కొన్ని ప్రాంతాల్లో షర్మిల పార్టీ సైతం ఉందని చెప్పుకొచ్చారు. బీహార్ విభజనకు ముందుకు రాష్ట్రం మొత్తం ఆర్జేడీ ఉండేదన్నారు. జార్ఖండ్ ఏర్పాటు అయిన తరువాత ఆ రాష్ట్రంలో ఆర్జేడీ లేకుండా పోయిందన్నారు. ప్రశాంత్ కిషోర్ ఇచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా కొన్ని నిర్ణయాలు ఉంటాయనిఅన్నారు.  

 తెలంగాణ‌లో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్ వ‌స్తుందంటున్న బీజేపీ నేత‌లు అంటున్నార‌న్నారు. డ‌బుల్ ఇంజ‌న్ అంటే మోడీ, ఈడీ లేకపోతే జుమ్లా, హమ్ల అంటూ సెటైర్లు వేశారు.  ప్రధాన మంత్రి నరేంద్రమోది దసానికి ప్రధానికాదనిఆయన గుజరాత్ కు మాత్రమే ప్రదానమంత్రి అని అన్నారు. ప్రధాని ప్రైవేట్ కార్యక్రమాలకు వస్తే ముఖ్యమంత్రి స్వాగతం పలకాలని లేదని అన్నారు. మన్ మోహన్ సింగ్ ప్రదానిగా ఉన్నపుడు గుజరాత్ పర్యటనకు వెళితే ఆనాడు సిఎం గా ఉన్న నరేంద్ర మోది స్వాగతం పలకలేదని గుర్తు చేశారు.  

అప్పుల విషయంలో కేంద్రం శత్రు దేశాలపై ఆంక్షలు విధించినట్లు  కక్షకట్టి వ్యవహరిస్తోందని  విమర్శించారు.  దేశంలో ఏ రాష్ర్టంలో  లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగాయని చెప్పారు. త్వరలోనే కొత్త పెన్షన్లు రేషన్ కార్డులు ఇస్తామని ఈ విషయంలో ముఖ్యమంత్రి త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో ఆలస్యం అనేది పెద్ద సమస్య  కాదని పరిస్థితులను బట్టి అలా జరుగు తుందని అన్నారు. కెసిఆర్ సిఎం అయిన తర్వాతే    ఉద్యోగులకు జీతాలు భారీగా పెంచారని అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు