భారత్ లో గూగుల్ పిక్సల్ 6 ఏ ఫోన్లు


గూగుల్ పిక్సల్ 6  ఏసిరీస్ భారత్ లో అందుబాటులోకి తీసుకురానున్నారు.   జూలై చివరి వారంలో  గూగుల్ పిక్సల్ 6ఏ భారత మార్కెట్లోకి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ ఫోన ధర సుమారు రూ.40,000 లోపు ఉంటుందని అంటున్నారు. పిక్సల్ 4ఏ అనంతరం గూగుల్ మరో ఫోన్ ను భారత మార్కెట్లోకి తీసుకు రాలేక పోయింది. కారణాలు ఏమనేది తెలియదు. ఫిక్సల్ ఫోన్లకు భారత్ లో ఆశించినంతంగా ఆదరణ లభించిందా లేదా అనేది  గూగుల్ వెల్లడించ లేదు. ప్రపంచంలో భారత్ మొబైల్ మార్కెట్లో బాగా  డిమాండ్  కలిగిన దేశం. అయితే ఇక్కడి వినియోగ దారుల అవసరాలకు తగిన రీతిలో ఉండే మొబైల్ ఫోన్లకు మాత్రమే మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది.  పిక్సల్ 5 సిరీస్ ను గూగుల్ ఇతర మార్కెట్లలో విడుదల చేసినా, ఎందుకనో భారత్ మార్కెట్ కు పరిచయం చేయలేక పోయింది. ఇందుకు మార్కెట్ సమస్యలే కారణం అయి ఉండవచ్చని భావిస్తున్నారు.

ఇక ఇప్పుడు నేరుగా పిక్సల్ 6ఏను తీసుకురానుండడంతో అందరూ ఆసక్తి కలబరుస్తున్నారు.  గూగుల్ పిక్సల్ 6, 6 ప్రో ఫోన్లు లోగడే అమెరికాలో విడుదలయ్యాయి. పిక్సల్ 6ఏ ఫీచర్లు 6ను పోలి ఉంటాయి. ఇందులో గూగుల్ సొంత చిప్ అయిన టెన్సార్ ఉంటుంది. పిక్సల్ 6 మాదిరే డిజైన్ ఉంటుంది. 

టిప్ స్టర్ అంచనా ప్రకారం పిక్సల్ 6ఏ ధర భారత్ లో రూ.37,000గా ఉండొచ్చని తెలుస్తోంది. కానీ, విడుదల తేదీ, ధరలను ఇంత వరకు గూగుల్ అధికారికంగా ప్రకటించలేదు. ఈ నెలాఖరుకు వీటిని విడుదల చేయవచ్చని, ఫ్లిప్ కార్ట్ లో విక్రయాలు జరుగుతాయని తాజాగా సమాచారం బయటకు వచ్చింది. 6ఏను గూగుల్ కెనడా మార్కెట్లో విడుదల చేయగా, అక్కడ 599 కెనడా డాలర్ల ధర నిర్ణయించింది. బ్రిటన్ లో 399 పౌండ్లుగా నిర్ణయించింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు