కెసిఆర్ పై గజ్వేల్ నుంచే పోటి - ఈటల రాజేందర్

గజ్వేల్ నుంచే పోటి

గజ్వేల్ లో సీరియస్ గా వర్క్ చేస్తున్నామన్న ఈటల

పశ్చిమ బెంగాల్ సీన్ తెలంగాణాలో రిపీట్

 


వచ్చే ఎన్నికల్లో సిఎం కెసిఆర్ పై గజ్వేల్ నియోజకవర్గం నుండి పోటి చేస్తానని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ప్రకటన చేశారు. తాను గతంలో కూడ గజ్వేల్ నుండి పోటీ చేస్తానని చెప్పానని దానికి కట్టుబడి ఉన్నానని అన్నారు. గజ్వేల్ నుంచే తాను గతంలో టిఆర్ఎస్ పార్టీలో చేరానని గుర్తు చేశారు. 

శనివారం మీడియాతో జరిగిన చిట్ చాట్ లో ఈటల ఈ విషయం వెల్లడించారు. గజ్వేల్ నియోజక వర్గం పై దృష్టి పెట్టామని గ్రౌండ్ వర్క్ ప్రారంభించామని తెలిపారు. తెలంగాణ లో సిఎం కెసిఆర్ ను ఓడించాల్సిన అవసరం ఉందని పశ్చిమ బెంగాల్ లో బిజెపి నేత సువేందు అధికారి సిఎంను ఓడించిన రీతిలో తెలంగాణలో సీన్ రిపీట్ అవుతుందన్నారు. 

రాష్ట్రంలో బిజెపీలో కి చేరేందుకు అనేక మంది ఉత్సాహం చూపుతున్నారని ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరం చేస్తామని చెప్పారు. 

పోడు భూముల వ్యవహారం తేల్చుతానంటూ అసెంబ్లీలో స్వయంగా పలు మార్లు  చెప్పిన సిఎం కెసిఆర్ ఏవి పట్టించు కోలేదని  గిరిజనుల పట్ల అత్యంత దారుణంగా క్రూరంగా ప్రవర్తించారని అన్నారు. గిరిజనుల నుండి పోడు భూములకు సంభందించి స్వీకరించిన మూడు లక్షల దరఖాస్తులు పరిష్కరించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేసారు. మంచిర్యాల జిల్లాలో గిరిజనులపై అటవి శాఖ అధికారులు చేసిన దౌర్జన్యాలను ఖండించారు. గిరిజనుల భూమల సమస్య పరిష్కారం అయ్యే వరకు పార్టి పరంగా అండగా నిలుస్తామని చెప్పారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు