తెలంగాణ లో సర్కార్ నౌకర్ల జాతర - అసెంబ్లీలో ప్రకటన చేసిన సిఎం కెసిఆర్


 సర్కార్ నౌకర్ల  భర్తీ  కోసం బుధవారం నుండి ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. ఇంత కాలం సర్కార్ నౌకర్ల భర్తి కోసం ఎదురు చూసిన నిరుద్యోగులకు ఇది శుభపరిణామం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇంత పెద్దసంఖ్యలో సర్కార్ నౌకర్ల భర్తీకి చర్యలు చేపట్టడం ఇదే తొల సారి.

ఉద్యోగాల  భర్తీపై అసెంబ్లీలో  సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని. వాటిలో 80,039 ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. మిగిలిన 11,103 ఒప్పంద ఉద్యోగులకు క్రమబద్దీకరిస్తున్నట్లు చెప్పారు.

నిరుద్యోగుల జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించడంతో పాటు మొత్తం ఖాళీలలో 11, 103 కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు సీఎం కేసీఆర్‌. అలాగే మిగిలిన వాటిల్లో  80, 039 పోస్టులకు ఇవాళ్టి(మార్చి 9, 2022) నుంచే నోటిఫికేషన్లు జారీ అవుతాయని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అంతేకాదు ఉద్యోగ గరిష్ట వయోపరిమితిని పదేళ్లకు పెంచుతున్నట్లు తెలిపారు. 

మొత్తం 80, 039 ఖాళీల్లో..  అత్యధికంగా హోం శాఖలో 18, 334 ఖాళీలు ఉన్నాయి. తర్వాతి  సెకండరీ ఎడ్యుకేషన్‌లో 13, 086 ఖాళీలు, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖలో 12, 775 ఖాళీలు ఉన్నాయి. 

 ఉన్నత విద్యలో 7, 878, బీసీల సంక్షేమం 4, 311, రెవెన్యూలో 3, 560, షెడ్యూల్‌ కాస్ట్స్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌లో 2, 879, ఇరిగేషన్‌లో 2, 692, ఫైనాన్స్‌లో 1, 146, అత్యల్పంగా లెజిస్లేచర్‌లో 25, విద్యుత్‌ శాఖలో 16 ఖాళీలు ఉన్నాయి. 

 కాంట్రాక్ట్ ఉద్యోగాలు వద్దన్నందుకు రాష్ట్రంలోని పలు పార్టీలు కోర్టుకు వెళ్లాయని చెప్పారు సీఎం కేసీఆర్‌. ఉద్యోగి కన్నా కాంట్రాక్ట్ ఉద్యోగులే ఎక్కువ పనిచేస్తుంటార‌ని, అయినప్ప‌టికీ వారి జీతాలు మాత్రం తక్కువగా ఉంటున్నాయ‌ని చెప్పారు. 

 కాంట్రాక్ట్ పేరుతో శ్రమదోపిడి ఉండకూడ‌ద‌నేది త‌మ‌ అభిలాష అని అన్నారు. అందుకే 11, 103 కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యుల‌రైజ్ చేస్తున్న‌ట్లు తెలిపారు. ఇక ఉద్యోగ క్యాలెండర్ విడుద‌ల చేస్తామ‌ని చెప్పారు. క్ర‌మంగా ఉద్యోగాల భ‌ర్తీ ఉంటుంద‌ని చెప్పారు. 

 రాష్ట్రంలో ఇప్ప‌టికే తాము 1.56 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చామని, 1.12 లక్షల కొత్త పోస్టులు మంజూరు చేశామ‌ని చెప్పుకొచ్చారు. తెలంగాణ‌లో 1,33,940 ఉద్యోగాలు భర్తీ అయ్యాయని చెప్పారు. 

 95 శాతం లోకల్‌ కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామ‌ని అన్నారు. కేంద్ర స‌ర్కారు సమస్యలను పరిష్కరించడం లేదని అన్నారు. దేశంలోనే అతి త‌క్కువ అప్పులు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ఆయ‌న చెప్పుకొచ్చారు. తాము క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ప‌రిపాల‌న కొన‌సాగిస్తున్నామ‌ని చెప్పారు.  కొంద‌రు ఉద్యోగ‌ నియామకాలపై అర్ధరహిత వివాదాలు సృష్టించారని ఆయ‌న అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు