లండన్ లో బోనాల పండగ ఘనంగా నిర్వహించారు. వరంగల్ ఎన్ ఆర్ ఐ పోరం అధ్యక్షులు శ్రీధర్ నీల అధ్వర్యంలో లండన్ లోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో బోనాల ఉత్సవం నిర్వహించారు. ఆషాడ మాసంలో తెలంగాణ వారు ఘనంగా బోనాల పండగ నిర్వహిస్తారు. విదేశాలలో ఉండే తెలంగాణ ఎన్ఆర్ ఐ లు కూడ ఈ సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగిస్తున్నారు. బోనం వండి అమ్మవారికి భక్తి శ్రద్దలతో సమర్పించారు.
ఈ సందర్భంగా వరంగల్ ఎన్ఆర్ ఐ పోరం అధ్యక్షులు శ్రీధర్ నీల మాట్లాడుతు ప్రతి ఏటా బోనాల పండగ ఘనంగా నిర్వహిస్తామని 2 వేల మందికి తగ్గకుండా ఈ ఉత్సవంలో పాల్గొంటారని తెలిపారు. కోవిడ్ నిభందనల మేరకు అధిక సంఖ్యలో బోనాల ఉత్సవంలో పాల్గొన లేక పోయారని పరిమితంగా 50 మందితో బోనాల ఉత్సవం జరిపామని చెప్పారు. విదేశంలో ఉన్నప్పటికి భవిష్యత్ తరాలు మరిచి పోకుండా ఉండేందుకు క్రమం తప్పుకుండా తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు సంభందించిన అన్ని పండగలు, ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమం లో కిరణ్ పసునూరి వ్యవస్థాపక అధ్యక్షులు, జయంత్ వద్దిరాజు (వైస్ ప్రెసిడెంట్),
నాగ ప్రశాంతి (ప్రధాన కార్యదర్శి) యూకే టీం సభ్యులు రమణ సాదినేని, వంశి మునిగంటి, ప్రవీణ్ బిట్ల, శ్రవన్ బిట్ల, మధుకర్ కుర్మిల్ల, విశ్వనాధ్ కొక్కొండ, యశ్వంత్ నూక, నిఖిల్ రాపోలు, కవిత, రజిత, నితాష, అనూష, నీహారిక, జయశ్రీ, కమల, రాధిక, శ్రీష తదితరులతో పాటు ఇతర ఎన్ఆర్ఐ సబ్యులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box