కాంగ్రేస్ కు కౌశిక్ రెడ్డి రాజీనామా

 


హుజురాబాద్‌‌లో ఉపఎన్నిక కొత్త సమీకరణలకు దారి తీసింది.   ఈటెల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ పై  రాజకీయ పార్టీలు దృష్టిసారించాయి. ఈటెల రాజేందర్ బిజెపిలో చేరి అదే పార్టి నుండి పోటి చేసేందుకు ఇప్పటికే ప్రచారం ప్రారంభించగా టిఆర్ఎస్ పార్టి నేతలు కూడ ఆయనను ఎదుర్కునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. టిఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతుండగా కాంగ్రేస్ నేత పాడి కౌశిక్ రెడ్డి ఆడియో లీక్ కల కలం రేపింది. తానే టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటి చేయబోతున్నానని ఓట్లను ఎంతకైనా కొనుగోలు చేయగలనని మందు కూడ పోయగలనంటూ ఆయన ఓ పార్టి కార్యకర్తతో మాట్లాడిన ఫోన్ సంభాషణ కాస్త లీక్ కావడం రసకందాయం. దాంతే కాంగ్రేస్ పార్టి కౌశికి రెడ్డికి షోకాజ్ నోటీసు జారి చేయగా అందుకు ప్రతిగా కౌశిక్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. అంతే కాకుండా టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, పార్టి ఇన్ ఛార్జి మాణిక్కం ఠాగూర్ పై తీవ్ర విమర్శలు చేసారు. 

మాణిక్కం ఠాగూర్‌‌కు రూ.50 కోట్లు ఇచ్చి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా అయ్యారంటూ ఆరోపించారు. మాణిక్కం ఠాగూర్ ఓ యూజ్‌లెస్ ఫెలో అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

చాలాబాధతో రాజీనామా నిర్ణయం తీసుకున్నానని చెప్పిన కౌశిక్ రెడ్డి.. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావాలని కోరుకున్న వారిలో నేను మొదటివాడిని. కానీ, హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ గెలవదన్న రేవంత్‌ వ్యాఖ్యలు బాధ కలిగించాయని అన్నారు.

రేవంత్ రెడ్డికి మేం పిచ్చోళ్లలా కనిపిస్తున్నామా? అంటూ ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ భ్రమల్లో ఉన్నారని, అమ్ముడు పోయింది నేను కాదు.. రేవంత్‌రెడ్డేనని, ఈటల రాజేందర్‌కు రేవంత్ రెడ్డి అమ్ముడు పోయారంటూ విమర్శించారు.

కాంగ్రేస్ పార్టీలో ఏ నేత కూడ రేవంత్ కు పీసీసీ ఇవ్వటం హాపీగా లేరని అన్నారు.  కోమటిరెడ్డి బ్రదర్స్ , శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క వంటి వారంతా ఆగ్రహంగా ఉన్నారన్నారు. రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్  కలిసి హుజూరాబాద్ ఉప ఎన్నికలో డిపాజిట్ తెచ్చుకావాలని సవాల్ చేసారు. ముమైత్ ఖాన్ వచ్చినా జనాలు వస్తారని విజిల్స్ వేస్తారని చెప్పారు. తెలంగాణ ముమైత్ ఖాన్ రేవంత్ రెడ్డి అంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కౌశిక్ రెడ్డి మాజి టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమీప భందువు. 2018 ఎన్నికల్లో ఈటెల రాజేందర్ పై పోటి చేసి ఓడి పోయారు.  ఈటెలను టార్గెట్ చేస్తు అనేక సార్లు కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు.

ఇక కౌశిక్ రెడ్డి నిజంగా టిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారా ఆయనే అభ్యర్థిగో పోటలో నిలవబోతున్నారా చూడాలి. అభ్యర్థి విషయంలో టిఆర్ఎస్ పార్టి గోప్యత పాటిస్తోంది. మరోవైపి తెలుగు దేశం పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు