ʹహత్యాపథంలోʹ స్టాన్ స్వామి హత్య ఒక పెద్ద పరిణామం-అరుంధతీ రాయ్

 


భారతదేశ ప్రజాస్వామ్యం క్రమేపీ పయనిస్తున్న ʹహత్యాపథంలోʹ స్టాన్ స్వామి హత్య ఒక పెద్ద పరిణామం. చూడటానికి చిన్నదిగా కనిపించినా, నిజానికి ఇది చాలా పెద్ద సంఘటన. విస్తృతంగా ప్రభావం వేసిన ఒక అత్యంత పెద్ద సంఘటన.
మన మిత్రులు మనల్ని నిర్దేశిస్తున్నారు. వాళ్ళు "ఈ నేలకు ఒక శాపం పెట్టారు."
కస్టడీలో ఒక 84 ఏళ్ళ ముసలి క్రైస్తవ జెస్యుట్ ఫాదర్ ని క్రమంగా ʹచావుʹలోకి నెట్టి, చంపేయడం అత్యంత సిగ్గుపడాల్సిన మురికి చర్య. ఆయన తన జీవితంలో అనేక దశాబ్దాల పాటు ఈ దేశంలోని ʹతమ కంటూ ఏమీలేని, తమని ఎవ్వరూ చేరదీయనిʹ ప్రజానీకం పనిచేసిన ఈ వ్యక్తి హత్య మన సమాజంలోని కిటికీ దగ్గరే జరిగింది. మన న్యాయ వ్యవస్థ, పోలీసులు, నిఘా విభాగపు సంస్థలు, ఇక్కడి జైలు వ్యవస్థలే ఈ హత్యకు బాధ్యులు. ఈ దేశప్రజాలకి, మన ప్రధాన స్రవంతి మీడియాకి కూడా ఈ కేసు గురించి క్షుణ్ణంగా తెలుసు. దిగజారి పోతున్న అతని ఆరోగ్య పరిస్థితి గురించీ తెలుసు. అయినప్పటికీ ఆయన్ని అదేవిధంగా క్రుంగదీశారు.
ఈ పెద్దమనసున్న, నిజాయితీ గల, ఆరోగ్యం ఏమాత్రం బాగోని అద్భుతమైన వ్యక్తి తనతోపాటు ఉన్న బికే కేసుగా పిలవబడుతున్న 16 మంది సహచర నిందితుల్లో ఒకరుగానే చనిపోయారు. కంప్యూటర్ హార్డ్ డిస్క్ లను పరీక్షించే ఫోరెన్సిక్ విశ్లేషకులు ఒక బూటకపు కథను అల్లగానే అవసరమైన కొన్ని ఫైళ్లను, ఈ కేసులోనే మరో నిందితుడిగా ఉన్న రోనా విల్సన్ కంప్యూటర్ లోకి చొప్పించారనడానికి పెద్ద సాక్ష్యం ఉందని వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో వచ్చిన ఒక కథనం తెలియజేసింది. అయితే ఈ రిపోర్టు బయట పడకుండా ప్రధాన స్రవంతి మీడియా, కోర్టులు కలిసి పాతిపెట్టేశాయి.
ఫాదర్ చనిపోయిన ఒకరోజు తర్వాత అంటే మంగళవారం నాడు ఇదే కేసులో మరొక సహా నిందితుడు సురేంద్ర గాడ్లింగ్ తన కంప్యూటర్ లో కూడా మాల్ వేర్ ప్రవేశపెట్టినట్లు సాక్ష్యం ఉందని తెలియజేశారు. కానీ - మనకి ఇక్కడ ఉపా అనే ఒక చట్టం ఉంది. అది నిందారోపణ మోపబడిన వ్యక్తుల్ని పెద్ద లాయర్లనీ, మేధావులనీ, కార్యకర్తలనీ ఎంతకాలమైనా నిర్బంధంలో ఉంచే వీలు ప్రభుత్వానికి కల్పిస్తోంది. ఎంతకాలమంటే - వాళ్ళు జబ్బుపడి చనిపోయేదాకా కానీ, లేక ఏళ్లతరబడి సాగే జైలు జీవితం వారి జీవితాలను పూర్తిగా ధ్వంసం చేసేదాకా కానీ నిర్బంధం లో ఉంచవచ్చు. అందరూ అంటున్నట్టు ఉపా చట్టాన్ని దుర్వినియోగం చేయడం లేదు. దాన్ని సరిగ్గా ఇందుకోసమే తయారు చేశారు.
క్రమక్రమంగా జరిగిన ఫాదర్ స్టాన్ స్వామి హత్య ఒక అత్యంత సిగ్గుపడాల్సిన, ప్రజాస్వామ్య విస్తృత భాగంలో ప్రభావం చూపగలిగే సంఘటన. .మనకి మనం ఇంకా ప్రజాస్వామ్యంగా పిలుచుకునే దాన్ని మరింత క్రమక్రమంగా కాకుండా చేసిన హత్య.
ʹమనం మన మిత్రుల చేత పాలించబడతాం. అయితే వాళ్ళు ఈ నేలకు శాపం పెట్టారుʹ.

- అరుంధతీ రాయ్
(తెలుగు అనువాదం అశోకన్ వీవీ అయ్యర్)


(2021-07-08 23:32:17)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు