వరంగల్ గొప్ప వైద్య కేంద్రంగా మారాలి- సిఎం కెసిఆర్

 


వ‌రంగ‌ల్ న‌గ‌రం గొప్ప విద్యా, వైద్య కేంద్రంగా భాసిల్లాలని వైద్యం కోసం ఇక్కడికి హైదరాబాద్ నుండి రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు.  సోమవారం వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

 సెంట్రల్ జైళు కూల్చిన స్థానంలో సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి భవణ సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాళోజి వైద్య విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్మించిన పరిపాలన భవణానికి ప్రారంభోత్సవం చేసారు. కొత్తగా నిర్మించిన వరంగల్ అర్బన్ ఇక నుండి హన్మకొండ జిల్లా  కలెక్టర్ కార్యాలయంగా పరగణించే నూతన కార్యాలయ భవణ సముదాయానికి ప్రారంభోత్సవం చేశారు.

వ‌రంగ‌ల్ కు పెట్టుబడులు రావాలని  క‌చ్చితంగా ప‌రిశ్ర‌మ‌ల కేంద్రం కావాలని సిఎం అన్నారు.  గొప్ప విద్యాకేంద్రంగా, వైద్య కేంద్రంగా నిలవాలన్నారు.  తూర్పు తెలంగాణకు ఇది ఒక హెడ్ క్వార్ట‌ర్ కావాలన్నారు. ప్ర‌పంచంలో అత్యంత అధునాత‌న వైద్య స‌దుపాయాలు కెన‌డాలో ఉన్నాయ‌ని వైద్య‌శాఖ అధికారుల‌తో క‌లిసి కెన‌డాను విజిట్ చేసి వీడియోలు, ఫోటోలు చిత్రీక‌రించాలని ఇక్కడ నిర్మించబోయే ఆసుపత్రి కెన‌డాను త‌ల‌ద‌న్నేలా ఉండాలని అన్నారు. 

"అన్ని వైద్య సేవ‌లు ఒకే ప్రాంగ‌ణంలో రావాలి. మ‌హిళ‌లు ప్ర‌స‌విస్తేనే మ‌నంద‌రం పుట్టాం. మాతాశిశు సంర‌క్ష‌ణ చాలా ప్రాధాన్య‌మైన అంశం. తెలంగాణ మొత్తం నాగ‌రికంగా మారాలి. ప్ర‌తి పాత తాలుకా సెంట‌ర్‌లో మాతాశిశు సంర‌క్ష‌ణ కేంద్రాలు రావాలి. ఒక మినీ నిలోఫ‌ర్ సెంట‌ర్ రావాలి. వ‌రంగ‌ల్‌కు డెంట‌ల్ కాలేజీ, డెంట‌ల్ హాస్పిట‌ల్ మంజూరు చేస్తున్నాం. హైద‌రాబాద్ వాళ్లు కూడా ఇక్క‌డికే వ‌చ్చేలా విద్య‌, వైద్య స‌దుపాయాలు క‌ల్పించాలి. త్వ‌ర‌లోనే మామునూర్ ఎయిర్‌పోర్టు రాబోతుంది. వ‌రంగ‌ల్‌లో మంచినీళ్ల గోస లేదు. వ‌రంగ‌ల్లో పెట్టుబ‌డులు రావాలి. ఐటీ కంపెనీల‌ను విస్త‌రించాలి"  అని కేసీఆర్ అన్నారు.


వరంగల్ అర్బన్ జిల్లా పేరు మార్పు

వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాల పేర్లు మార్చనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ వరంగల్ జిల్లా పర్యటన సందర్బంగా ప్రకటన చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ జిల్లా గాను అట్లాగే రూరల్ జిల్లా వరంగల్ జిల్లాగాను పేర్లు మార్చనున్నారు. ఒకటి రెండు రోజుల్లో  జిల్లాల పేర్ల మార్పులకు సంభందించి జివోలు విడుదల కానున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.

పోలీసుల అతి జాగ్రత్తతో ప్రజా ప్రతినిధులకు ఇబ్బందులు

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు అతి జాగ్రత్తలు పాటించడంతో ప్రజలు అట్లాగే అధికార పార్టి ప్రజా ప్రతినిదులు సైతం ఇబ్బందులు పడ్డారు. ముఖ్యమంత్రి పర్యటించే రహదారుల్లో ఉదయం నుండి ఎవరిని అనుమతించ లేదు. చివరికి అధికార పార్టి ప్రజా ప్రతినిధులను కూడ అనుమతించ లేదు. నర్సంపేట ఎమ్మెల్యే  పెద్ది సుదర్శన్ రెడ్డి, భుపాలపల్లి ఎమ్మెల్యే గండ్రవెంకట రమణా రెడ్డి లను పోలీసులు అనుమతించక పోవడంతో ఇబ్బంది పడ్డారు.  పెద్ది సుదర్శన్ రెడ్డి కాల నడకన కెయు క్రాస్ రోడ్ నుండి మంత్రి దయాకర్ రావు కాంపు కార్యాలయం వరకు  ప్రయాణించారు.

ముందస్తు అరెస్టులు


విపక్షనేతలను ఎప్పటి లాగే పోలీసులు సిఎం కెసిఆర్ పర్యటనకు ముందు రోజు రాత్రి అరెస్ట్ చేశారు. ఉభయ కమ్యునిస్టు పార్టినేతలతో పాటు భారతీయ జనతా పార్టి నేతలను కాకతీయ యూనివర్శిటి విద్యార్థులను పలువురుని అరెస్ట్ చేసారు. కొందరిని గృహ నిర్భందం చేసారు.

అయినా కెయు విద్యార్థులు సిం కెసిఆర్ కాన్వాయ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కెసిఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఉద్యోగాలు భర్తి చేయాలని డిమాండ్ చేసారు. కాన్వాయ్ కు అడ్డంగా పరుగెత్తుతున్న విద్యార్థులను పోలీసులు వెంబడించి పట్టుకుని అరెసెట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.

మాజి మంత్రి కడియం శ్రీహరి ఇంట్లో సిఎం లంచ్

రొటీన్ కు భిన్నంగా సిఎం కెసీఆర్ ఈ సారి వరంగల్ పర్యటనలో వ్యవహరించారు. ఉద్యమ కాలం నుండి కెసిఆర్ ఎప్పుడు వరంగల్ పర్యటనకు వచ్చినా కెప్టెన్ లక్ష్మి కాంత రావు ఇంట్లో బస చేసి ఆయన ఆతిధ్యం పుచ్చుకునే వారు. కాని ఈ సారి అందుకు భిన్నంగా ఎమ్మెల్సి పదవి కాలం పూర్తి అయిన మాజి మంత్రి కడియం శ్రీహరి ఇంట్లో మధ్యాహ్న బోజనం చేసారు. సిఎంతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడ కడీయం శ్రీహరి ఇంట్లో భోజనాలు చేశారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు