వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న వరంగల్ కమిషనరేట్ పోలీసులు

 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న వరంగల్ కమిషనరేట్ పోలీసులు


కోరనా కష్ట కాలంలో కట్టడి చర్యలు సమర్దవంతంగా నిర్వహించిన వరంగల్ పోలీసులు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు.  వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు తీసుకున్న చర్యలపై వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో బెస్ట్ పోలీసింగ్ గా గుర్తింపు లభించింది.  బెస్ట్ పోలీసింగ్, పబ్లిక్ హెల్త్ సర్వీస్ కేటగిరిలో వరంగల్ పోలీస్ కమీషనరేట్ అత్యున్నత  సేవలు కనబరిచినందుకు గుర్తించి ఈ చోటు కల్పించారు. ఈ రికార్డుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషికు త్వరలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ ప్రతినిధుల చేతుల మీదుగా సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ పత్రాన్ని అంద చేయనున్నారు. కరోనా కట్టడికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా సేఫ్టీ మెజర్స్ తీసుకున్నందుకుగాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ ను ఎంపిక చేయడం జరిగిందని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హెడ్ ఆఫ్ యూరఫ్ విల్బెమ్ జెజ్లర్ పేరుతో ఆదివారం  వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయమునకు సమాచారం అందింది.

ఈసందర్బంగా వరంగల్ పోలీస్ అధికారులను సిబ్బందిని పలువురు అభినందించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు