లండన్ లో వరంగల్ ఎన్ఆర్ ఐ ల మహా అన్న దాణం

 ఈస్ట్ హాం లండన్ లో మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు


కరోనా మహమ్మారి నుండి అందరి క్షేమం కోరుతూ వరంగల్ ఎన్ ఆర్ ఐ లు లండన్ లో మహాఅన్న దాణం నిర్వహించారు. ఈస్ట్ హాం లండన్ లో మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి  మహాప్రసాదం పంచారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎన్ఆర్ ఐలు తమ కుటుంబ సబ్యులతో పాల్గొన్నారు.

కరోనా మహమ్మారి లండన్ లో క్రమంగా నియంత్రణలోకి  రావడంతో  ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.  లాక్ డౌన్ కు సంభందించిన పలు ఆంక్షలు ఎత్తి వేసారు. పూర్తిగా ఎత్తి వేసే దిశగా ఆలోచనలు చేస్తున్నారు.



ఈ నేపద్యంలో ఇంత కాలం ఆంక్షల మద్య ఇండ్లలో గడిపిన వరంగల్ ఎన్ ఆర్ ఐలు ఊరటతో ఒకరిని నొకరు ప్రత్యక్షంగా కల్సుకుని యోగ క్షేమాలు విచారించుకుంటున్నారు. కష్ట కాలంలో భగవంతునిపై భారం వేసి గడిపామని  అందరు క్షేమంగా ఉండాలని కోరుకున్నామని   ఈ క్రమంలోనే  ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మహాఅన్న దాణ కార్యక్రమం నిర్వహించామని వరంగల్ ఎన్ఆర్ఐ ఫోరం లండన్ యుకె అద్యక్షులు శ్రీధర్ నీల తెలిపారు. 

ప్రధాన కార్యదర్శి నాగ ప్రశాంతి,   ఫౌండర్ మెంబర్  కిరణ్ పసునూరి, ట్రెజరర్  జయంత్ వద్ది రాజు ఉపాద్యక్షులు భాస్కర్ పిట్టల, రమణ సాదినేని, భాస్కర్ నీల జాయింట్ సెక్రెటరీలు వంశి మునిగంటి,ప్రవీణ్ బిట్ల తదితరులు పాల్గొన్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు