వరంగల్ ఎన్ ఆర్ ఐ లండన్, యుకె ఫోరం నూతన కమిటి ఎన్నికలు జరిగాయి. 2021-2023 సంవత్సరానికి గాను గతంలో అద్యక్షు లుగ పనిచేసిన శ్రీధర్ నూలను రెండో సారి అద్యక్షులుగా ఎన్నుకున్నారు. శ్రీధర్ నీల అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా నాగ ప్రశాంతి ఎన్నిక కాగా ఫౌండర్ మెంబర్ గా కిరణ్ పసునూరి శాశ్వత సభ్యుడిగా వ్యవహరిస్తారు. ఉపాద్యక్షులుగా, ట్రెజరర్ గా జయంత్ వద్ది రాజు ఉపాద్యక్షులగా భాస్కర్ పిట్టల, రమణ శాదినేని, భాస్కర్ నీల జాయింట్ సెక్రెటరీలుగా వంశి మునిగంటి,ప్రవీణ్ బిట్ల, ఐటి సెక్రెటరీగా యశ్వంత్ నూక్స్, బిజినెస్ సెక్రెటరీగా ధీరజ్ తోట, కల్చరల్సెక్రెటరీగా కమలా పుల్లూరి, ఈస్ట్ లండన్ ఇన్ చార్జిగా మధుకర్ కుర్మిల్ల, మధు వంగర, భాస్కర్ బొడ్ల, KENT,SLOUGH ఇన్ ఛార్జీలుగా ఎన్నికయ్యారు. మీడియా ఇన్ ఛార్జిగా దీక్షిత్ పోలె పాక, కోర్ కమిటి సలహా దారులుగా విశ్వనాధ్ కొక్కొండ, ఈవెంట్ ఆర్గ నైజర్అండ్ కోర్ కమిటి మెంబర్లుగా నిఖిల్ రాపోలు, శ్రీనివాస్ మునిగోటి, ప్రదీప్ పెంట పుర, దినేష్ లింగబత్తిని, విజయ సింగారపు వ్యవహరిస్తారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎన్ ఐర్ ఐ లు ఏర్పాటు చేసిన ఫోరం పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించింది. విదేశాలలో ఉండి ఓరుగల్లు గడ్డపై రుణం తీర్చుకుంటున్న వరంగల్ ఎన్ ఆర్ ఐ లండన్, యుకె ఫోరం పలువురి మన్ననలు అందుకుంది.
లాక్ డౌన్ సమయంలో గిరిజన ప్రాంతాల వారికి నిత్యావసరాలు అంద చేసారు. అంధుల పాఠశాలకు అనాధ ఆశ్రమానికి విరాళాలు ఇచ్చారు. అనారోగ్యం పాలైన పలువురికి ఉదారంగా ఆర్థిక సహాయం చేశారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box