అంధుల పాఠశాల నిర్వ హణకు తోడ్పాటు నందించిన వరంగల్ ఎన్ ఆర్ ఐలు
ఎన్ఆర్ ఐ ల సహాయానికి శిలాఫలకంపై పేరు చెక్కించి కృతజ్ఞత తెలిపిన అంధుల పాఠశాల యాజమాన్యం
ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వరంగల్ ఎన్ఆర్ఐ ఫోరం లండన్, యుకె చేసిన సహాయానికి శిలాఫలకంపై పేరు చెక్కించి కృతజ్ఞతలు తెలుపుకున్నారు అంధుల పాఠశాల నిర్వాహకులు . వరంగల్ జిల్లా కేంద్రంలోని కొత్తవాడ ఆటో నగర్ లో నిర్వహిస్తున్న లూయూస్ ఆదర్శ అంధుల పాఠశాల కు వరంగల్ ఎన్ఆర్ ఐ ఫోరం లండన్ యుకె వారు విడతల వారీగా సుమారు 4 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అంద చేసారు. ఈ నిధులతో పాఠశాల పై అంతస్తుతో పాటు అదనపు తరగతి గదులను నిర్మించారు. పాఠశాలకు చేసిన సహాయానికి కృతజ్ఞతగా వరంగల్ఎన్ఆర్ ఫోరం లండన్ యుకె సభ్యులకు పాఠశాల నిర్వాహకులు శిలాఫలకంపై పేరు చెక్కించారు.
పాఠశాలకు ముందు ముందు కూడ తోడ్పాటు నందిస్తామని వరంగల్ ఎన్ ఆర్ ఐ ఫోరం లండన్, యుకె అధ్యక్షులు శ్రీధర్ నీల, ఫౌండర్ కిరణ్ పసునూరి తెలిపారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box