కెనెడాలో తెలంగాణ ధూం ధాం

 వర్చువల్ గా నిర్వహించిన కార్యక్రమంలో ఆడి పాడిన తెలంగాణ కెనడా వాసులు


తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వ ర్యంలో 05 జూన్, 2021 శనివారం రోజున

గ్రేటర్  టోరొంటో నగరం లోని తెలంగాణ ప్రాంత వాసులు తెలంగాణ ఆవిర్భా వ దినోత్సవం

పురస్కరించుకుని  ధూం ధాం సాంస్కృతిక ఉత్స వాలు వర్చు వల్ గ  ఘనంగా

జరుపుకున్నా రు.

ఈ సందర్భంగా  సుమారు 250కి పైగా కెనడా తెలంగాణ వాసులు పాల్గొని విజయవంతం

చేశారు. ఈ కార్యక్రమం  మొదట జనరల్ సెక్రెటరి  దామోదర్ రెడ్డి మాది 

ప్రారంభించగా, అధ్య క్షులు రాజేశ్వర్ ఈద  ఆధ్వ ర్యంలో, బోర్డాఫ్ స్టడీస్ 

అధ్య క్షులు సంతోష్ గజవాడ  జ్యోతి ప్రజ్వలన చేసి, వ్యవస్థాపక  అధ్య క్షులు వేణుగోపాల్

రోకండ్ల సభికులతో అమర వీరులకు శ్రద్ధాంజళి ఘటింప చేసారు. ఉపాద్యక్షులు శ్రీనివాస్ మన్నెం,



కల్చరల్ సెక్రెటరి కవిత తిరుమలాపురం , ట్రెజరర్ నవీన్ ఆకుల, కార్యవర్గ సబ్యులు, బోర్డాఫ్ ట్రస్టి సబ్యులు పాల్గొన్నారు. 

కార్య క్రమాన్ని యూత్  డైరెక్టర్ రాహుల్ బాలినేని, ధాత్రి అంబటి సమన్వయ పరిచారు.


కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆపూర్వ శ్రీవాత్సవ ముఖ్య అతిథిగా పాల్గొని సందేశం ఇచ్చారు. 

సాంస్కృతిక కార్యక్రమాలతో సభికులను అలరించారు.



ప్రముఖ మిమిక్రి కళాకారుడు సని నటుడు శివారెడ్డి తన మిమిక్రీతో మైమరిపించాడు. శివారెడ్డి కుమారెత్ మోక్షితా రెడ్డి కూచిపూడి నాట్యం ప్రదర్శించి అలరించారు.

సిరిసిల్ల జానపద కళా బృందం ఆకునూరు దేవయ్య, నక్క శ్రీకాంత్, డప్పు రాజు, బాలు తదితరులు జానప గీతాలు ఆలపించి ఒగ్గు కథ ప్రదర్శించారు.

ప్రముఖ తెలంగాణ వాగ్గేయ కారుడు గోరటి వెంకన్న శుభాకాంక్షలు తెలిపారు.  

 తెలంగాణ కెనడా అసోసియేషన్ టెక్నికల్ టీం సబ్యులు వెంకట  జితేందర్ చక్క, రిషియా గజవాడ, వైష్ణవి ఈద తదితరులు అంతరాయం లేకుండా వర్చువల్ ఈవెంట్ విజయ వంతం చేసారు.

వ్యవస్థాపక సబ్యులు శ్రీనివాస్ తిరునగరి, విజయ కుమార్ తిరుమలాపురం, కోటేశ్వర్ రావు చిత్తలూరి, దేవేందర్ రెడ్డి గుజ్జుల, రమేశ్ మునుకుంట్ల, చంద్ర స్వర్గం, శ్రీనాధ్ రెడ్డి కందుకూరి, శ్రీహరి రాహుల్, ప్రభాకర్ కంభాలపల్లి, ప్రకాష్ చిట్యాల, సయ్యద్ లతీఖ్ పాష, అఖిలేష్ బెజ్జంకి, నవీన్ సూది రెడ్డి, కలీమొద్దీన్ మహ్మద్ పాల్గొన్నారు.

ధూమ్ ధామ్ 2021 కార్యక్రమం శ్రీనివాస్ మన్నం వందన సమర్పణతో ముగిసింది.  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు