సిద్దిపేట తెలంగాణకు నడిగడ్డ... హమేశా ఆ గౌరవం ఉంటది..కెసిఆర్


జిల్లాల పర్యటనల్లో భాగంగా ఆదివారం సిద్దిపేటలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పర్యటించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌ కార్యాలయం, సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.

ఈసందర్భంగా జరిగిన సమావేశంలో కెసిఆర్ మాట్లాడుతూ  సిద్ది పేటకు చాలా చేశామని ఇంకా చేస్తామని  మంచి భవిష్యత్ ఉందని అన్నారు. సిద్దిపేటను తెలంగాణాకు గరిమనాభిగా సెంట్రల్ తెలంగాణాగా  అభివర్ణించారు. రాజధాని హైదరాబాద్ లో ఉన్నా సిద్దిపేట నడిగడ్డ అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమం మొదలైన సందర్భంలో వి ప్రకాశ్ అనే మిత్రుడు ఓ పుల్ల పట్టి కొలిచి  సిద్దపేట తెలంగాణకు నిజంగానే నడిగడ్డ అని చెప్పాడన్నారు.  1969 లో వచ్చిన మొట్ట మొదటి ఉప ఎన్నికల్లో ఇక్కి నుండే తెలంగాణ ఉద్యమ కారుడు స్వర్గీయ మదన్ మోహన్ ను గెలిపించడం జరిగిందని  కెసిఆర్ గుర్తు చేశారు. తర్వాత తాను మొదలు పెట్టిన ఉద్యమంలో కూడ ఇక్కడి ప్రజలేఅదే ఉధృతితో తెలంగాణ భావజాలాన్ని ప్రస్పుటింప చేయడం జరిగిందని అన్నారు. అందుకే నడిగడ్డ అయిన తెలంగాణ కు హమేశా హమేశా ఆగౌరవం ఉంటదని అన్నారు. 

ఎన్టీఆర్ రెండు రూపాల కిలో పథకాన్ని గుర్తు చేస్తూ ఆ పథకాన్ని మెచ్చుకున్నారు.  గతంలో ఎన్టీఆర్ రూ.2 కే కిలో బియ్యం ఇచ్చారని, అది తనకెంతో నచ్చిన పథకమని  కేసీఆర్ అన్నారు. ఈ పథకం వల్ల ఎంతో మంది ఆకలి తీరిందని అన్నారు. ఇప్పుడు రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నామని చెప్పారు. 

 "రైతు బంధుపై ప్రభుత్వం పెట్టే ఖర్చు రూ.15 వేల కోట్లు. కొంత మంది బాగా ఫీలవుతున్నారు. దీంట్లో కనీసం రూ.150 కోట్లయినా మేం తినద్దా అని కొంత మంది ఫీలవుతున్నారు. రైతు బంధు దాదాపు 95 శాతం వారికి ఉపయోగపడుతోంది. ఇక ఎక్కడో ఒకరు మందు తాగడానికి వాడుకుంటున్నారు అది వేరే విషయం. రాష్ట్రంలో 93 శాతం మంది రైతులు ఐదెకరాల లోపు వారే ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం భూములు 2.5 కోట్ల ఎకరాలు. కేవలం రైతుల వద్దే కోటిన్నర ఎకరాలు ఉన్నాయి" అని కెసిఆర్ అన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు