జర్నలిస్ట్ రఘుకు 14 రోజుల రిమాండ్

 

జర్నలిస్ట్ రఘుకు 14 రోజుల రిమాండ్
హుజూర్ నగర్ జైళుకు తరలింపు


గుర్రంపోడు భూముల కేసులో జర్నలిస్ట్ రఘుకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దాంతో ఆయనను హుజూర్ నగర్ జైళుకు తరలించారు.

అధికార పార్టీ నేతల అక్రమాలు, భూకబ్ధాలు వెలుగులోకి తెచ్చిన జర్నలిస్ట్ రఘును పోలీసులు గురువారం అరెస్ట్ చేసారు. గుర్రంపోడు భూముల కబ్జా కేసులో జర్నలిస్ట్ రఘును ముద్దాయిగా చేస్తు గతంలో కేసులు నమోదు చేసారు. ఈ కేసుకు సంభందించి పోలీసులు గురువారం ఉదయం రఘును ఆయన ఇంటికి సమీపంలో అరెస్ట్ చేసి నెంబర్ ప్లేట్ లేని వాహనంలో తీసుకు వెళ్లారు. రఘు ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ముందు కుటుంబ సబ్యులు ఆందోళన చెందారు. ఆ తర్వాత ఆరా తీయగా పోలీసులే గుర్రంపోడు భూముల కేసులో అరెస్ట్ చేసినట్లు తెల్సింది.

హుజుర్‌ నగర్ జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. తర్వాత అతనిని హుజూర్ నగర్ జైలుకు తరలించారు.

రఘు అక్రమ అరెస్టను టిజెఎఫ్ అధ్యక్షులు పల్లె రవి కుమార్ ఖండించారు. అధికార పార్టి నేతలు భూ కబ్జాలు అక్రమాలు వెలుగు లోకి తెచ్చిన జర్నలిస్టు పై అక్రమ కేసులు పెట్టడం అన్యాయ మన్నారు. రఘును విడుదల చేయాలని డిమాండ్ చేసారు.

యాంకర్ రఘు అరెస్ట్‌పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. ఈ రోజు రఘుకు జరిగిందే రేపు మరో జర్నలిస్టుకు జరగొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. రఘు అరెస్ట్‌ను ఖండిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపితే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూర్ నగర్ నియోజకవర్గం గుర్రంపోడు తండా గిరిజన భూములను అధికార పార్టీ నేతలు ఆక్రమిస్తే ఆ భూభాగోతాన్ని మీడియాలో చూపించినందుకు రఘుపై కేసు నమోదు చేశారని బండి సంజయ్ ఆరోపించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు