పేద విద్యార్థులకు తోడ్పడేందుకు తన తల్లి దండ్రుల పేరిట ఏర్పాటు చేసిన పొన్నాల వెంకటమ్మ ట్రస్ట్ ద్వారా సహాయంచేస్తున్న రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ పొన్నాల రామయ్య ఇద్దరు పేద విద్యార్థిణీలకు ఆన్ లైన్ క్లాసులు అటెండ్ అయ్యేందుకు రెండు మొబైల్ ఫోన్లు బహూకరించారు. ఎలుకతుర్తి మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధి బాలికా విద్యాలయంలో పదవ తరగతి చదువుతున్న ఈర వర్షిణి, నిత్య శ్రీ అనే ఇద్దరు విద్యార్థులకు పొన్నాల రామయ్య మొబైల్ ఫోన్లు బహూకరించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ రెడ్డి, ఎఎమ్ఓ మనోజ్ కుమార్, కెజిబివి తెలంగాణ కోఆర్డినేటర్ శిరీష, కెజివిబి ఎలుకతుర్తి ఎస్ ఓ అనిత, కేశవాపూర్ ప్రధానోపాధ్యాయులు సాయిరెడ్డి, మూల రామకృష్ణ ఐతా శ్రీనివాస్ తదితరులు జూమ్ ఆప్ ద్వారా జరిగిన విర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పేద విద్యార్థుల చదువులకు తోడ్పడేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవలందిస్తున్న పొన్నాల రామయ్య ను అభినందించారు. విద్యార్థులకు ఫోన్లు బహూకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్బంగా పొన్నాల రామయ్య మాట్లాడుతు పట్టుదల ఉంటే చదువుకునేందుకు పేదరికం అడ్డు కాదని అన్నారు. ఎంతో మంది పేదరికంలో ఉండి చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగారని చెప్పారు. కష్ట పడి చదివి తమ తల్లి దండ్రుల కళలు నిజం చేయాలని అన్నారు.
ఇంగ్లీషు మీడియం చదువుకునే స్తోమత లేని ఐదుగురు పేద విద్యార్థులను గుర్తించి పొన్నాల వెంకటమ్మ ట్రస్ట్ ద్వారా ఫీజులు భరించి చదివి పిస్తున్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box