ఉద్యోగాలపేరిట హైటెక్ మోసం - గూగుల్ సెర్చ్ లో వెదికి మోస పోయారు


గత ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారి కారణంగా నిరుద్యోగుల బతుకు ఆగం అయింది. ఇంజనీరింగ్ నిరుద్యోగాలు అయితే ఇంటర్వ్యూలు లేక ఇంట్లో ఖాళీగా కూర్చో లేక అవస్థలు పడుతున్నారు.  ఇలాంటి నిరుద్యోగులను టార్గెట్ చేసి హైదరాబాద్ లో ఓ వ్యక్తి లక్షల్లో టోకరా వేసి ఉడాయించాడు. అతని కోసం సైబర్ క్రైం పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి.  

ఇంజనీరింగ్ నిరుద్ద్యోగాలుపాపం గూగుల్ లో సెర్చ్ చేసి ఇలా మోస  పోయారు. ఉద్యోగాల కోసం సెర్చ్  చేస్తుంటే ఓ ఫోన్ నెంబర్ కనిపించింది. దాంతో ఆ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయయగా మాదాపూర్ లో కొత్తగా లిమిటెక్స్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ ఏర్పాటు చేసామని తానే కంపెన సిఇవో నంటూ ఆ వ్యక్తి నమ్మించాడు. రిక్రూట్ మెంట్లు జరుగుతున్నాయని రెస్యూమ్స్ పంపమని చెప్పాడు. దాంతో నిరుద్యోగులు రెస్యూమ్స్ పంపించగా జాబ్ గ్యారంటీగా రావాలంటే ముందుుగా సెక్యూరిటి డిపాజిట్ కొంత చెల్లించాలంటూ అభ్యర్థులకు మాయ మాటలు చెప్పాడు. కొందరు అభ్యర్థులు నమ్మి అక్కౌంట్ లో కి డబ్బులు ట్రాన్స్ ఫ్ర్ చేశారు. దాదాపు 40 మంది అభ్యర్థులు ఇలా డబ్బులు చెల్లించారు. డబ్బులు అన్ని జమ అయిన తర్వాత సదరు వ్యక్తి డ్రా చేసుకుని ఉడాయించాడు.  ఒక్కొక్కరు లక్ష నుండి 2 లక్షల వరకు చెల్లించారు. సుమారు 30 లక్షలవరకు అభ్యర్థులు మోస పోయారు.   ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అభ్యర్థులు అనుమానంవేసి కంపెనీ అడ్రస్ కోసం వెదికారు. మాదాపూర్ లో లిమిటెక్స్‌  పేరిట ఏ కంపెని లేక పోవడంతో  పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. సైబర్ క్రై పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు