కరోనా వైద్య చికిత్స పరికరాలపై జీఎస్టి తగ్గింపు

 


కరోనా వైద్యం విషయంలో కేంద్రానికి చాలా రోజుల తర్వాత కనువిప్పు కలిగింది. రెండేళ్లుగా కరోనా మహమ్మారి విసిరిన పంజాతో విల విల లాడుతు చికిత్స కోసం లక్షలాది రూపాయలు వెచ్చిస్తుంటే  వైద్య పరికరాలపై జిఎస్టి తగ్గించ కుండా తాత్సారం చేసిన కేంద్రం తాజాగా పలు వైద్య పరికరాలపై జిఎస్టి తగ్గిస్తు నిర్ణయం తీసుకుంది. జీఎస్టి కౌన్సిల్ సమావేశంలో  మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, బిపాప్ మెషీన్స్, ఆక్సిజన్ కాన్సట్రేటర్లు, వెంటిలేటర్లు, పల్స్ ఆక్సిమీటర్స్, కోవిడ్ టెస్టింగ్ కిట్స్ వంటి వాటిపై జీఎస్‌టీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కరోనా చికిత్సలో ఉపయోగించే వైద్య పరికరాలపై జిఎస్టి 12 శాతం నుంచి 5 శాతా ికి తగ్గించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. శనివారం న్యూఢిల్లీలో జరిగిన 44 వ జీఎస్ టి కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్లాక్ ఫంగస్ సోకిన కరోనా భాదితులకు వినియోగించే మెడిసిన్స్ పై కూడ ఎలాంటి పన్నులు ఉండవని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. అయితే కరోనా వాక్సిన్ల పై ప్రస్తుతం ఉన్న  5 శాతం జీ ఎస్టి అమల్లో ఉంటుంది. కరోనా వైద్య పరికరాలపై తగ్గించిన జీ ఎస్టి తగ్గింపు నిర్ణయం సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు