పాత కలెక్టర్ కార్యాలయం నిజాం విడిది కేంద్రం
అయిన ఒకప్పటి హైవానే షాహి
వరంగల్ కలెక్టర్ బంగ్లా గురించిన చరిత్రను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆసక్తికరంగా వివరించాడు. హన్మకొండ సుబేదారి ప్రాంతంలో ఉన్న కలెక్టర్ నివాస బంగ్లా నిజాం కాలం నాటి సుబేదారి నిలయం. పక్కనే పాత కలెక్టర్ కార్యాలయం ఉండేది. దాన్ని కూల్చి వేసి దాని స్థానంలో కొత్త సముదాయం నిర్మించారు. సోమవారం సిఎం కెసిఆర్ ఈ సముదాయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతు సుబేదారి చరిత్రను నిజాం కాలం నాటి నిజాం విడిది కేంద్రాల గురించి వివరించాడు. నిజాం కాలంలో నాడు వరంగల్ జిల్లా అంతా బాగా అడవి వ్యాపించి ఉండేదని నిజాం నవాబు వేట కోసం వచ్చేవాడని తెలిపారు. భువనగిరిలో ఉన్న ఢాక్ బంగ్లా నిజాం రాజు విడిది కోసం నిర్మించారని ఆయన హైదరాబాద్ నుండి వరంగల్ వచ్చే మార్గ మద్యంలో ఢాక్ బంగ్లా దగ్గర తన పటాలంతో ఆగి ఢాక్ (దస్త్రాలు) చూసేందుకు ఈ బంగ్లా నిర్మించారని తెలిపారు.
వరంగల్ లో విడిది చేసేందుకు కూడ ఓ విడిది కేంద్రం నిర్మించాడని దాన్ని హైవానే షాహి అని పిలిచేవారని అందులో నిజాం నవాబు విడిది చేసే వాడని చెప్పారు. దాని పక్కనే ఇప్పటి కలెక్టర్ బంగ్లా ను వరంగల్ సుబా అయిన సుబేదార్ కోసం నిర్మించారని తెలిపారు. ప్రస్తుతం పాత కాలం నాటి కలెక్టర్ బంగ్లా ఉరుస్తోందని దాని స్థానంలో అధునాతన సౌకర్యాలతో కొత్త భవణం నిర్మించాలని చీఫ్ సెక్రెటరి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. రెండెకరాల విశాల స్థలంలో కలెక్టర్ రెసిడెన్సి నిర్మించి మిగతా స్థలాన్ని కలెక్టర్ కార్యాలయానికి వదిలి వేయాలని ఆదేశించారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box