"కేసీఆర్‌పై జనం దాడులు చేసే రోజు వస్తుంది. కేసీఆర్ నీ పతనం మొదలైంది" అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు.
దాడికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓయూ జేఏసి నేత సురేష్ యాదవ్ ను బండి సంజయ్ బుధవారం పరామర్శించాడు. ఈసందర్భంగా మాట్లాడుతు సురేష్ యాదవ్ పై సిఎం కెసిఆర్ డైరెక్టన్ లోనే దాడి జరిగిందని బండి సంజయ్ ఆరోపించారు. బలిదానాలకు తెగించి కొట్లాడిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన భూమిక పోషించిన విద్యార్థులపై రాక్షస సీఎం డైరెక్షన్‌లో టీఆర్ఎస్ పార్టీ గూండాలు దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కెసిఆర్ రాష్ట్రాభి వృద్ది కోసం ఒక్క రూపాయి కూడ ఖర్చు చేయలేదని బండి సంజయ్ విమర్శించాడు. ధనిక రాష్ట్రం అయిన తెలంగాణను అప్పులపాలు చేశారని బండి సంజయ్ విమర్శించాడు. తెలంగాణలో ప్రతి పథకానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తోందని చెప్పారు. టీఆర్ఎస్ గడీల పాలన అంతం కావాలంటే బీజేపీకి పట్టం గట్టాలన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box