ఏరకం కరోనా వైరస్ అయినా ఈ టీకా తో మటాష్

  అమెరికా శాస్త్ర వేత్తల ప్రయోగాల్లో సత్పలితాలిచ్చిన కొత్త రకం టీకా


ఏ రకం కరోనా వైరస్ అయినా మటాష్ చేసే టీకాను అమెరికా శాస్ర్త వేత్తలు రూపొందించారు. కరోనా వైరస్ అన్నిరకాల పై ఈ టీకా సమర్దవతంగా పనిచేస్తున్నట్లు పరిశోధనల్లో నిర్దారణ అయింది. అమెరికాలోని డ్యూక్‌ యూనివర్సిటీ హ్యూమన్‌ వ్యాక్సిన్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన బార్టన్‌ ఎఫ్‌ హేన్స్‌ నేతృత్వంలోని సైంటిస్టుల బృందం ఈ కొత్త టీకాను రూపొందించింది.

ప్రపంచ వ్యాప్తంగా మ్యుటేషన్ అయిన ఏ వైరస్ ను అయినా ఈ టీకా మట్టు పెట్ట గలదని శాశ్ర్త వేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. అన్ని కరోనా వేరియంట్లు, స్రెయిన్ల జాతులు, గబ్బిలాలకు సంబంధించిన కరోనావైరస్ అన్నింటిపై ఈ టీకా అద్భుతంగా పనిచేసిందని శాస్ర్త వేత్తలు వెల్లడించారు.

పరిశోధనల్లో భాగంగా ప్రథమంగా కోతులు, ఎలుకలపై ఈ టీకా ప్రయోగించగా మంచి ఫలితాలు వచ్చాయి. ఇక మనుషులపై ప్రయోగించేందుకు శాస్ర్త వేత్తలు సిద్దపడుతున్నారు. ఒకప్పటి సార్స్‌ మహమ్మారిపై జరిగిన పరిశోధనల ఆధారంగా తమ పరిశోధనలు జరిగాయని శాస్ర్తవేత్తలు తెలిపారు. 

కరోనా వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌.. మానవ కణాల్లో గ్రాహకాలకు అనుసంధానం ద్వారా వైరస్ వ్యాప్తిచెందుతోంది. ఈ ప్రొటీన్‌పై ఉండే ‘రెసెప్టార్‌ బైండింగ్‌ డొమైన్‌’పై సైంటిస్టులు ఫోకస్ పెట్టారు. మానవ శరీరంలోకి వైరస్ ప్రవేశించడానికి ఈ స్పైక్ అనుమతిస్తుంది.  ‘రెసెప్టార్‌ బైండింగ్‌ డొమైన్‌’లోని ఓ నిర్దిష్ట భాగాన్ని లక్ష్యంగా చేసుకుని యాంటీబాడీలు వైరస్‌పై దాడి చేస్తాయని సైంటిస్టులు నిర్దారణకు వచ్చారు.

ఓ నానో రేణువు రూపొందించి రీర రోగ నిరోధకశక్తిని మరింత పెంచేందుకు పటికతో తయారైన ఒక పదార్థాన్ని ఈ రేణువుకు జత చేశారు. దీనిని కోతుల్లో ప్రవేశ పెట్టినపుడు కరోనా వైరస్ ప్రవేశాన్ని సమర్దవంతంగా నిరోధించింది. అధిక శాథ యాంటి బాడీలను ఉత్పత్తి చేసింది. ఇంకా కొన్ని నిర్దారణల అనంతరం మానవ శరీరాల్లో ప్రవేశ పెట్టి పరిశోనలు చేయనున్నారు. ఈ టీకా ఆవిష్కరణ జరిగితే ఇక ఏ రకం  కరోనా వైరస్ అయినా మట్టుపెట్ట గలదని అంటున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు