జర్నలిస్టుల కోసం సుప్రీం కోర్టు ప్రత్యేక యాప్

  ప్రారంభించిన సిజేఐ ఎన్.వి రమణ
కోర్టు తీర్పుల ప్రత్యక్ష ప్రసారాలకు సిద్దం


సుప్రీం కోర్టు తీర్పుల వార్తలు రిపోర్ట్ చేసేందుకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్.వి.రమణ ప్రత్యేకంగా చొరవ చూపారు. కరోనా నేపద్యంలో జర్నలిస్టులు  వార్త సేకరణ కోసం సుప్రీం కోర్టుకు రానవసరం లేకుండా ఇతరులపై అధారపడే అవసరం లేకుండా నేరుగా విర్చువల్ విధానంలో కోర్టు తీర్పులను  రిపోర్ట్ చేయవచ్చు. ఇందు కోసం ప్రత్యేకంగా సుప్రీం కోర్టు ఓ యాప్ ను రూపొదించింది. తీర్పులకు సంభందించిన వార్తల సేకరణకు జర్నలిస్టులు న్యాయ వాదులపై ఆధారపడే వారు. ఇప్పుడా అవసరం లేకుండా యాప్ ద్వారా లాగిన్ అయి కోర్టు తీర్పులను పరిశీలించవచ్చు.

సిజేఐ ఎన్.వి రమణ గురువారం ఈ యాప్ ను ప్రారంభించారు. జస్టిస్ కన్వికల్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ధనుంజయ్ ల కమిటి నేతృత్వంలో  ఈ యాప్ ను  రూపొందించారని  సిజేఐ తెలిపారు. సుప్రీం కోర్టు సాంకేతిక నిపుణుల  బృందం కేవలం మూడు రోజుల వ్యవధిలో యాప్ ను రూపొందించడం విశేషం.

ఈ సందర్బంగా సిజేఐ మాట్లాడుతూ  కోర్టు కార్యకలాపాలు పారదర్శకంగా ఉండేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని నిర్ణయించామని చెప్పారు. ఇక ముందు సుప్రీం కోర్టు కార్యకలాపాలన్ని ప్రత్యక్ష ప్రసారాలు చేసేందుకు సంసిద్దంగా ఉన్నామని తెలిపారు.  సహ న్యాయ మూర్తులతో విఫులంగా చర్చించి రానున్న రోజుల్లో సుప్రీం కోర్టు కార్య కలాపాలన్ని ప్రత్యక్ష ప్రసారాలు చేస్తామని వెల్లడించారు. 

ప్రస్తుతం కోవిడ్ పరిస్థితుల నేపద్యంలో జర్నలిస్టులు సుప్రీం కోర్టు తీర్పులను సేకరించి వార్తలుగా ఇవ్వడంలో ఎదుర్కుంటున్న ఇబ్బందులు సిజే ఐ ప్రస్తావించారు.  ప్రస్తుత ఇబ్బంది కరమైన పరిస్థితుల్లో  కోర్టు వార్తల సేకరణ కోసం జర్నలిస్టులు పడుతున్న ఇబ్బందులు తమకు తెల్సునని అన్నారు.

గతంలో తాను కొద్ది కాలం జర్నలిస్టుగా పనిచేసిన అనుభవాలను సిజేఐ  గుర్తు చేసుకున్నారు. వార్త సేకరణ కోసం కారు కాని బైక్ కాని అందుబాటులో లేని రోజుల్లో  వార్తల సేకరణ ఎంత కష్టమో తనకు తెల్సునని అన్నారు. జర్నలిస్టులు సుప్రీం కోర్టు తీర్పుల సందర్బంగా వార్తల సేకరణలో పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకే ఈ యాప్ రూపొందించామని అన్నారు. సుప్రీం  కోర్టుకు, మీడియాకు మద్య  అనుసంధానం అవసరమని ఇందు కోసం ప్రత్యేక అధికారిని నియమిస్తామని తెలిపారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ల జారి  విషయంలో అన్యాయం జరగకుండా చూస్తామని తెలిపారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు