అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఏం పంపించాడంటే

 


కరోనా  కష్టకాలంలో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్  చేసిన సహాయం ఇండియాకు చేరింది. ప్రత్యేక కార్గో విమానంలో  కరోనా రిలీఫ్ సామాగ్రి ఇండియాకు చేర వేశారు.   కరోనా చికిత్సలో అత్యవసరంగా వినియోగించే మెడికల్ సామాగ్రి ఇందులో ఉంది. 

 అమెరికా ఇండియాకు చేస్తున్న సహాయంలో సుమారు 100 మిలియన్ డాలర్ల(భారత కరెన్సీలో రూ.744కోట్లు) విలువైన వైద్య పరికరాలు, ఔషధాలు ఉన్నాయని యు.ఎస్ వైట్ హౌజ్ వెల్లడించింది. 17 వందల ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, 11 వందల ఆక్సిజన్ సిలిండర్లు, 20 మంది రోగులకు నిరంతరాయంగా ప్రాణవాయువు సరఫరా చేసే ఆక్సిజన్ యూనిట్లు ఉన్నాయి. 

 'మేము కష్టాల్లో ఉన్నప్పుడు భారత్ మాకు సాయం చేసింది. ఇప్పుడు భారత్ కష్టాల్లో ఉంది. కనుక మేమూ వాళ్లకు సాయం చేస్తాం. కరోనాతో పోరాడుతున్న భారత్‌కు మా పూర్తి మద్దతు ఉంటుంది.' అని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ట్వీట్ చేశారు.

"అమెరికా ఇండియా మద్య 70 ఏళ్లకు పైగా ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు బలపరుస్తూ ఇండియాను అగ్రరాజ్యం ఆదుకుంది. రెండు దేశాలు కలిసి మహమ్మారితో పోరాడాలి." అని యూఎస్ ఎంబసీ ట్వీట్ చేసింది. ఇక ముందు కూడ ఆదుకుంటామని వివిద సంస్థలు, వ్యక్తుల ద్వారా భారత్ కు విరాళంగా ఇచ్చే వైద్య, పరికరాలు,ఔషధాలు సమకూరస్తామని విదేశాంగ శాఖ అధికారులు తెలియ చేసారు. 

ఇండియాకు సహాయం చేసేందుకు అమెరికాలోని కార్పోరేట్ కంపెనీలు కూడ ముందుకు వచ్చాయి. ప్రపంచంలో 40 దేశాలకు పైగా సహాయం  అంద చేస్తామని ప్రకటించాయి. ప్రాణవాయువు తయారి పరికరాలతో పాటు , వివిద రకాల  వైద్య పరికరాలు,  ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, కరోనా టెస్టింగ్ కిట్లు, మెడిసిన్స్ ఇండియాకు వివిద దేశాల నుండి అందజేయనున్నారు.

ఐరాస,రష్యా  నుండి

ఐరాస అనుబంధ సంస్థలు భారత్‌లో మహమ్మారిపై పోరు కోసం 7 వేల ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు,  500 ఆక్సిజన్‌ సరఫరా పరికరాలు, కొవిడ్‌-19 టెస్టింగ్‌ యంత్రాలు, పీపీఈ కిట్లు పంపించేందుకు సన్నాహాలు చేస్తోంది. 

రష్యా నుండి . ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, ఊపిరితిత్తుల వెంటిలేషన్‌ పరికరాలు, మానిటర్లు, మందులు కలిపి మొత్తం  20 టన్నుల వైద్య సామగ్రి ఇండియాకు చేరింది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు