ఉద్రిక్తతల మద్య సునీల్ మృత దేహం తరలింపు

 

ఎక్కడి కక్కడ నాయకులను అడ్డుకున్న పోలీసులు


బోడ సునీల్ మృతి ఉద్రిక్తతతకు దారి తీసింది.  కాకతీయ,ఉస్మానియా యూనివర్శిటీల విద్యార్థులు ఆందోళనకు దిగారు.

పోస్టు మార్టం నిర్వహించిస్తున్న గాంధి ఆసుపత్రి వద్ద ఉస్మానియా విద్యార్థులు ఆందోళనకు దిగగా పోలీసులు అరెస్ట్ చేసారు. వరంగల్ లో మంత్రి యెర్రబెల్లిదయాకర్ రావు ఇంటిను ముట్టడించేందుకు విద్యార్థులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసారు.

సునీల్ మృత దేహం ఆయన స్వగ్రామం అయిన గూడురు మండలం లోని తేజావత్ సింగ్ తండాకు తరలించారు. గ్రామంలోకి ఎవరూ రాకుండా పోలీసులు వివిద రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నేతలన మద్యలోనే  అడ్డగించారు. 

ప్రొఫెసర్ కోదండరాం ను కేసముద్రం మండలం అర్పనపల్లి గ్రామంలోఅరెస్టు చేసారు. బిజెపి చీఫ్ బండి సంజయ్ పెద్దపల్లి జిల్లా మంధిని లో పార్టి సభ ముగించి సునీల్  అంత్యక్రియల్లో పాల్గొనేందుకు తిరిగి వెళుతుండగా మార్గ మద్యంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అరెస్టు చేసారు. ఆయనతో పాటు బిజెపి నేతలు వివేక్ వెంకట స్వామి, బొడిగె శోభ తదితరులు ఉన్నారు. సునీల్ అంత్యక్రియల్లో పాల్గొనకుండా పోలీసులు అడుగడుగునా నిర్భంధం కల్పించడాన్ని పలు పార్టీల నేతలు నిరసించారు.



ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూర్య (సీతక్క)  తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ వరంగల్ పార్లమెంటు కన్వీనర్ సాయిని నరేందర్,కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు కూచన రవళి, పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు సోమ రామమూర్తి, ఎం.సి.పి.ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి గాదెగోని రవి, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్, లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు పోరిక ఈశ్వర్ సింగ్, యూనివర్సిటీ విద్యార్థి నాయకులు అతి కష్టంపై సునీల్ స్వగ్రామం చేరుకుని ధర్నా జరిపారు.

సునీల్ కుటుంబాన్ని ఆదుకుంటామని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని డబుల్ బెడ్ రూము ఇళ్ళు మంజూరు చేస్తామని దహన సంస్కారాలకు లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఇదే విషయాన్ని మహబూబాబాద్ ఎస్పి రాజకీయ పార్టీల నేతలకు ఆందోళనలో పాల్గొన్న వారికి చెప్పినా ఆందోళన విరమించ లేదు.

సునిల్ చనిపోయింది తన కోసం కాదని తన లాంటి నిరుద్యోగుల కోసమని మూడు డిమాండ్లు ప్రభుత్వం ప్రకటించేవరకు ఇక్కడి నుండి వెళ్ళేది లేదని అన్నారు. సునిల్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, ఎంటెక్ చదివిన సునిల్ సోదరునికి  ఆఫీసర్ ఉద్యోగం ఇవ్వాలని, సునిల్ కోరినట్లుగా ఉద్యోగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

అధికార పార్టీల నేతలు ఎవరూ సునీల్ కుటుంబాన్ని ఓదార్చేందుకు రాలేదు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాధోడ్ తదితరులు పత్రిక ప్రకటనలతో సరిపెట్టారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు